Reading Time: < 1 minute

Aggipette Macha Kiran: అగ్గిపెట్టె మచ్చ కిరణ్‌కు ఏమైంది? వెంటిలేటర్‌పై చికిత్స.. అభిమానుల్లో ఆందోళన!

Caption of Image.

సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘అగ్గిపెట్టె మచ్చ’ అలియాస్ కిరణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో అక్టోబర్ 5న తిరుపతిలోని SVIMS ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తుండగా.. వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉంచినట్లు తెలుస్తోంది.

కిరణ్ ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన అభిమానులు, ఫాలోవర్లలో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారిక వైద్య ప్రకటన వెలువడాల్సి ఉంది.

అభిమానుల్లో ఆందోళన..

తాజాగా కిరణ్ ఆసుపత్రిలో చేరడం, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారన్న సమాచారం అభిమానులను కలవరపెడుతోంది. సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు పోస్టులు చేస్తున్నారు. ‘అగ్గిపెట్టె మచ్చ’గా నవ్వించిన కిరణ్.. ఇప్పుడు ఆసుపత్రి బెడ్‌పై పోరాడుతున్నారన్న వార్త అభిమానులను కలచివేస్తోంది. ఆయన ఆరోగ్యంపై అధికారిక సమాచారం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. కిరణ్ త్వరగా కోలుకుని మళ్లీ తనదైన శైలిలో అభిమానులను పలకరించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. కిరణ్ ఆరోగ్య పరిస్థితిపై అధికారికంగా మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.

ALSO READ : కామెడీతో కేక పెట్టించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ట్రైలర్..

సోషల్ మీడియాలో ప్రత్యేక క్రేజ్..

తిరుపతికి చెందిన కిరణ్‌కు ‘అగ్గిపెట్టె మచ్చ’ పేరుతో సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తనదైన మాటతీరు, హావభావాలు, విభిన్నమైన శైలితో చేసిన వీడియోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. అలా ఒక్కో వీడియోతో ఆయనకు ఫాలోయింగ్ పెరిగి.. సోషల్ మీడియా ఫేమ్‌గా మారారు. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా.. కిరణ్ పేరు గతంలో పలు సందర్భాల్లో వార్తల్లోనూ నిలిచింది. ఆయనకు సంబంధించిన వీడియోలు, ఘటనలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి.

©️ VIL Media Pvt Ltd.