Reading Time: < 1 minute
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రెండు పెండింగ్ డీఏలకు సంబంధించిన బకాయిలను చెల్లించడంతో పాటు సాధారణ డీఏను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ డీఏను జనవరి 2024 నుంచి 33.67 శాతం నుంచి 37.31 శాతానికి పెంచారు.అలాగే జూలై 2024 నుంచి ఈ డీఏను 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక 2020 పే స్కేల్‌లోని ఉద్యోగులకు డీఏను 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెంచారు. 2015 పే స్కేల్‌లోని ఉద్యోగులకు డీఏను 73.344 శాతం నుంచి 78.06 శాతానికి పెంచగా, జూలై 2024 నుంచి 78.06 శాతం నుంచి 81.728 శాతానికి పెంచారు.

అలాగే యూజీసీ, ఏఐసీటీఈ పే స్కేల్ ఉద్యోగులకు సైతం డీఏను పెంచుతున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 2016 పే స్కేల్‌లోని ఉద్యోగులకు డీఏను 46 శాతం నుంచి 50 శాతానికి పెంచారు. జూలై 2024 నుంచి దీనిని 50 శాతం నుంచి 53 శాతానికి పెంచారు. ఇక 2006 పే స్కేల్‌లోని ఉద్యోగులకు డీఏను 230 శాతం నుంచి 239 శాతానికి పెంచారు. జూలై 2024 నుంచి దీనిని 239 శాతం నుంచి 246 శాతానికి పెంచారు.

ఈ పెంచిన పెంచిన డీఏను అక్టోబర్ 2026 వేతనంతో కలిపి ఉద్యోగులకు నవంబర్ 1న అందజేస్తారు. ఇక డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 2026 వరకు ఉన్న డీఏ బకాయిలను మొత్తం 33 వాయిదాల్లో చెల్లించనున్నట్టు తెలిపారు. జూలై 2024 నుంచి సెప్టెంబర్ 2026 వరకు ఉన్న డీఏ బకాయిలను 27 వాయిదాల్లో చెల్లించనున్నట్టు తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.