Reading Time: 2 minutes

OTT Trending Movies: జియోహాట్‌స్టార్లో ఈ వారం దుమ్మురేపుతున్న టాప్ 5 మూవీస్ ఇవే

Caption of Image.

ప్రతి వారం మాదిరిగానే ఈసారి కూడా జియోహాట్‌స్టార్‌లో కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, రియాలిటీ షోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకవైపు బిగ్ బాస్ 20 తనదైన డ్రామాతో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా.. మరోవైపు ఖత్రోన్ కే ఖిలాడీ 15 ఫినాలే కారణంగా ట్రెండింగ్‌లో ఉంది. ఇక క్రైమ్ థ్రిల్లర్ హుంకార్, హారర్ కామెడీ అలీ బాబా ఔర్ 40 భూత్ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓటీటీలోకి వచ్చిన మలయాళ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బెత్లెహేమ్ కుడుంబ యూనిట్ కూడా టాప్ 5లోకి దూసుకొచ్చింది.

1. బిగ్ బాస్ 20

జియోహాట్‌స్టార్ టాప్ ట్రెండింగ్‌లో బిగ్ బాస్ 20 మొదటి స్థానంలో నిలిచింది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ఎమోషన్స్, గేమ్ స్ట్రాటజీలు, టాస్కులు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కంటెస్టెంట్ల మధ్య జరిగే వాగ్వాదాలు, వివాదాలు షోకు మంచి బజ్ తీసుకొస్తున్నాయి. దీంతో కొత్త కంటెంట్ వచ్చినా బిగ్ బాస్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

2. ఖత్రోన్ కే ఖిలాడీ 15

రెండో స్థానంలో ఖత్రోన్ కే ఖిలాడీ 15 ఉంది. రోహిత్ శెట్టి హోస్ట్‌గా సాగే ఈ అడ్వెంచర్ రియాలిటీ షోలో కంటెస్టెంట్లు ప్రమాదకరమైన స్టంట్స్, ఛాలెంజింగ్ టాస్కులతో ప్రేక్షకులను అలరిస్తారు. తాజాగా గ్రాండ్ ఫినాలే జరగడం, విన్నర్ అనౌన్స్‌మెంట్‌పై భారీ ఆసక్తి ఏర్పడటంతో షో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ సీజన్ మొత్తం కంటెస్టెంట్ల పెర్ఫార్మెన్స్‌తో పాటు ఫైనల్ రేసు కూడా మంచి హైప్ తెచ్చుకుంది

3. హుంకార్

క్రైమ్ థ్రిల్లర్, కోర్ట్‌రూమ్ డ్రామా అంశాలతో తెరకెక్కిన హుంకార్ మూడో స్థానంలో నిలిచింది. మొత్తం ఆరు ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్‌లో మినూ రావత్ అనే మహిళ ప్రముఖ బాబాజీపై అత్యాచార ఆరోపణలు చేయడంతో కథ మొదలవుతుంది. ఆ కేసు చుట్టూ జరిగే పరిణామాలు, దర్యాప్తు, న్యాయపోరాటం కథలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అనీత్ పడ్డా, ఫాతిమా సనా షేక్, రఘుబీర్ యాదవ్ వంటి నటుల పెర్ఫార్మెన్స్ సిరీస్‌కు బలంగా నిలిచింది.

4. అలీ బాబా ఔర్ 40 భూత్

హారర్‌తో పాటు కామెడీని మిక్స్ చేసిన అలీ బాబా ఔర్ 40 భూత్ నాలుగో స్థానంలో ఉంది. సంప్రదాయ అలీబాబా కథకు భిన్నంగా.. కనిపించకుండా పోయిన తండ్రి కోసం వెతికే యువతి, మిస్టీరియస్ విగ్రహాలు, శాపాలు, అతీంద్రియ శక్తులు, 40 మంది భూతాల చుట్టూ కథ సాగుతుంది. అషా నేగి, విశాల్ వశిష్ఠ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. మిస్టరీ, హారర్, కామెడీ కలయిక ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

5. బెత్లెహేమ్ కుడుంబ యూనిట్

తాజాగా జియోహాట్‌స్టార్‌లోకి వచ్చిన మలయాళ చిత్రం బెత్లెహేమ్ కుడుంబ యూనిట్ ఐదో స్థానంలో నిలిచింది. నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ.. యాంగమలీ నేపథ్యంగా సాగుతుంది. యాష్లే అనే యువతి, తన కంటే వయసులో పెద్దవాడైన పొరుగింటి జస్టిన్ మధ్య ఏర్పడే అనుబంధం, ప్రేమ కథకు ప్రధానంగా ఉంటుంది. కుటుంబ సంబంధాలు, ప్రేమ, ఎమోషన్స్, కామెడీ కలగలిపిన ఈ సినిమా ఓటీటీలో మంచి స్పందన తెచ్చుకుంటోంది.ముఖ్యంగా అక్టోబర్ 2న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ మొదలైన బెత్లెహేమ్ కుడుంబ యూనిట్, అక్టోబర్ 2–4 మధ్య ఓటీటీలో ఇండియాలోనే అత్యధికంగా వీక్షించిన నాన్-హిందీ సినిమాగా నిలిచిందని తాజా రిపోర్ట్స్ వెల్లడించాయి. 

►ALSO READ | Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. తమన్ ట్వీట్‌తో లీక్..

మొత్తంగా చూస్తే.. ఈ వారం జియోహాట్‌స్టార్ టాప్ 5లో రియాలిటీ షోల హవా కొనసాగుతుండగా, హుంకార్ వంటి థ్రిల్లర్, అలీ బాబా ఔర్ 40 భూత్ వంటి హారర్ కామెడీ, బెత్లెహేమ్ కుడుంబ యూనిట్ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

©️ VIL Media Pvt Ltd.