Reading Time: < 1 minute
Gold Prices: దేశంలో మారిన బంగారం ధరలు.. ఊహించని మార్పులు జరిగాయ్.. అక్టోబర్ 7న తులం ఎంతంటే..?

బంగారం కొనుగోలుచేసేవారికి బ్యాడ్ న్యూస్. పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా ధరలు కుప్పకూలుతుండగా.. ఇప్పడు ఆ తగ్గుదలకు బ్రేక్ పడినట్లయింది. అంతర్జాతీయంగా ఆర్దిక అనిశ్చితి, ద్రవ్యోల్బణంపై భయాలు బంగారంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచిన తర్వాత పసిడి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా ధరలు ఒడిదొడుకుల మధ్య కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. అక్టోబర్ 7న బుధవారం దేశంలో ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

బంగారం ధరలు ఇవాళ ఎలా ఉన్నాయంటే..?

-దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,50,230 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,37,710 వద్ద ట్రేడవుతున్నాయి.

-హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,230గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,37,710 వద్ద కొనసాగుతున్నాయి.

-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,49,010 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,37,710గా కొనసాగుతోంది.

-బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,50,230 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,37,710గా కొనసాగుతున్నాయి.

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,380 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,37,560 వద్ద ట్రేడవుతున్నాయి.

సిల్వర్ రేట్లు ఇవే..

దేశంలో సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ధరలు స్వల్పంగా తగ్గగా.. దేశంలోనూ అదే బాటలో నడుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2,34,900 వద్ద కొనసాగుతోండగా.. మంగళవారం రూ.2.35 లక్షలుగా ఉన్నాయి.

-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,44,900 వద్ద ట్రేడవుతుండగా.. మంగళవారం రూ.2.45 లక్షల వద్ద స్దిరపడింది.

-చెన్నైలో కేజీ సిల్వర్ రేటు రూ.2,44,900గా ఉండగా.. మంగళవారం రూ.2.45 లక్షల వద్ద కొనసాగింది.

-బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,34,900గా కొనసాగుతుండగా.. మంగళవారం రూ.2.35 లక్షల వద్ద స్థిరపడింది.