
Vivo S2 FE: వివో (Vivo) S సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. vivo S2 FE పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ భారీ బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, ప్రీమియం డిజైన్, మన్నికైన బాడీ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఎక్కువ సమయం ఫోన్‌ను ఉపయోగించే వినియోగదారులను, ముఖ్యంగా వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, మీడియా వినియోగంపై ఆసక్తి ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది.
10,000mAh భారీ బ్యాటరీ..
vivo S2 FEలో ప్రధాన ఆకర్షణ 10,000mAh బ్యాటరీ. దీర్ఘకాలిక బ్యాటరీ పనితీరును ప్రదర్శించేందుకు నిర్వహించిన పరీక్షలో ఈ ఫోన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించింది. ‘Longest Electronic Product Testing Livestream’ విభాగంలో 32 గంటల 37 నిమిషాల పాటు నిరంతరంగా పనిచేసినట్లు కంపెనీ వెల్లడించింది. బ్యాటరీకి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు.
1.5K AMOLED డిస్‌ప్లే
ఫోన్‌లో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 1260×2800 పిక్సెల్స్ రిజల్యూషన్, HDR10+ సపోర్ట్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డిస్‌ప్లే గరిష్ఠంగా 2,000 నిట్స్ HBM బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. దీంతో బయట ఎండలో కూడా స్క్రీన్‌ను స్పష్టంగా చూడటంతో పాటు హై-క్వాలిటీ వీడియో స్ట్రీమింగ్‌కు అనుకూలంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
డైమెన్సిటీ 7300e ప్రాసెసర్
పనితీరు కోసం vivo S2 FEలో 6nm టెక్నాలజీపై తయారైన మీడియాటెక్ డైమెన్సిటీ 7300e చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది 2.5GHz వరకు క్లాక్ స్పీడ్‌తో పనిచేసే ఆక్టా-కోర్ ప్రాసెసర్. గ్రాఫిక్స్ కోసం Mali-G610 GPU అందించారు. ఈ ఫోన్ 6GB, 8GB LPDDR4X RAM వేరియంట్లలో లభిస్తుంది. స్టోరేజ్ 128GB UFS 3.1గా ఉంది.
కెమెరా విభాగం
ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాను అందించారు. ఇందులో సోనీ IMX852 సెన్సార్, f/1.8 అపెర్చర్ ఉన్నాయి. దీనికి 2MP సెకండరీ కెమెరా, Aura Light కూడా జత చేశారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32MP కెమెరా ఉంది. ఇది f/2.0 అపెర్చర్‌తో పనిచేస్తుంది.
మిలిటరీ గ్రేడ్ మన్నిక
vivo S2 FEకి IP68, IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్స్ అందించారు. అంతేకాకుండా MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీని కూడా కలిగి ఉంది. ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6తో పనిచేస్తుంది. కనెక్టివిటీ కోసం 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS వంటి సదుపాయాలు ఉన్నాయి. డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ కూడా లభిస్తుంది.
ధర ఎంతంటే?
డిజైన్ పరంగా vivo S2 FEను మూడు రంగుల్లో తీసుకొచ్చారు. స్టెల్లార్ గ్రీన్, జెన్ వైట్, టైటాన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. టైటాన్ బ్లాక్, స్టెల్లార్ గ్రీన్ మోడల్స్ మందం 8.59mm కాగా, జెన్ వైట్ వేరియంట్ 8.69mm మందంతో ఉంటుంది. ఫోన్ బరువు 224 గ్రాముల నుంచి 225 గ్రాముల వరకు ఉంది. ఈ మొబైల్ రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో భారత్‌లో లభిస్తుంది. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.38,999గా ఉండగా.. 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.42,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ అమ్మకాలు అక్టోబర్ 20, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఆఫర్స్
దీనిని వివో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు భాగస్వామ్య రిటైల్ స్టోర్లు, అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్లలో భాగంగా ఆఫ్‌లైన్ కొనుగోలుదారులకు ఎంపిక చేసిన బ్యాంకులు, క్రెడిట్ భాగస్వాములు, UPI ద్వారా 10 శాతం వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లేదా 10% వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ లభిస్తుంది. అదనంగా 15 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్‌ను కూడా అందిస్తున్నారు. ఆన్‌లైన్ కొనుగోళ్లపై 10% వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, 10% ఎక్స్‌చేంజ్ బోనస్ లేదా 12 నెలల వరకు నో-కాస్ట్ EMI సదుపాయం అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులకు ఒక సంవత్సరం అదనపు వారంటీని ఉచితంగా అందిస్తున్నారు.