Reading Time: < 1 minute
Chandrababu Pawan Meeting Ap Local Body Polls Seat Sharing

AP Local Body Polls: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి పార్టీల్లో రాజకీయ కసరత్తు ముమ్మరమవుతోంది. ఈ నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ భేటీ కానున్నారు. రేపుఉదయం 9.30 కు సీఎం చంద్రబాబు నివాసానికి రానున్నారు పవన్ కళ్యాణ్.. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది… తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు. ముఖ్యంగా.. ఈ భేటీలో ‘స్థానిక ఎన్నికలలో పోటీపై ఎలా ముందుకు వెళ్లాలి, ఎవరు ఎన్ని స్థానాలలో పోటీ చేయాలి’ అనే అంశాలపై ప్రధానంగా. చర్చ జరగనుంది. మేయర్ స్థానాలకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడుమాధవ్ లేదా మంత్రి సత్యకుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల ముందు కూటమి నేతల సమావేశం హాట్ టాపిక్ గా మారింది.

మొత్తంగా.. ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా కూటమి తరఫున స్థానిక ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి? ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? అభ్యర్థుల ఎంపికను ఎలా చేపట్టాలి? అనే అంశాలపై చర్చ జరగనుంది.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు అంశం కూడా భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మేయర్ స్థానాల విషయంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం, ఏ పార్టీకి ఏ స్థానాలు దక్కాలి అనే అంశాలపై కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది..

ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల నేతలు పలు దఫాలుగా సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు కూడా స్థానిక ఎన్నికల సన్నద్ధతపై చర్చించి, అభ్యర్థుల ఎంపికలో ప్రజామోదం ఉన్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ సమన్వయ కమిటీతో సమావేశమై క్షేత్రస్థాయి బలాబలాలపై సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, బీజేపీ నేతల భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.