
జర్మనీ మాజీ విదేశీ గూఢచార అధిపతి ఆగస్ట్ హ్యానింగ్‌ను దేశద్రోహం ఆరోపణలపై అరెస్టు చేశారు. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత జర్మనీలో జరిగిన అతిపెద్ద ఇంటెలిజెన్స్ స్కాంలలో ఒకటిగా చెప్పుకునే ఈ కేసులో దేశ నిఘా రహస్యాలను విక్రయించారనే ఆరోపణలతో మంగళవారం ఆగస్ట్ హ్యానింగ్ ను అరెస్ట్ చేశారు. దేశ నిఘా విభాగం సీక్రెట్ సమాచారాన్ని ఓ విదేశీ గూఢచర్య సంస్థ కు అమ్మేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ గూఢచర్య సంస్థను ఇప్పటివరకు గుర్తింపు గానీ, అది ఇతర వ్యక్తుల చేతికి చేరిందా లేదా అనేది అస్పష్టంగానే ఉన్నది.
అయితే ఓ దేశ నిఘా విభాగపు మాజీ అధిపతిని అరెస్టు సరికాదని ఇది మిత్ర దేశాలతో ఆ దేశ నిఘా సంబంధాలను దెబ్బతీస్తుందని జర్మని లామేకర్స్ ఆందోళన వ్యక్తం చేశారు.
2005లో BND విదేశీ గూఢచార సంస్థ అధిపతిగా ఆయన ఐదేళ్లు పనిచేశారు. దేశ నిఘా విభాగపు సీక్రెట్ సమాచారాన్ని షేర్ చేసేందుకు ఓ మాజీ BND ఆఫీస్ మేనేజర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు.