
హైదరాబాద్: పలు అవినీతి, అక్రమ ఆరోపణల నేపథ్యంలో ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్యను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కొంతకాలంగా ఆయనపై అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నట్లు సమాచారం.
గతంలోనే కృష్ణయ్యపై సస్పెన్షన్‌కు సంబంధించిన చర్యలు చేపట్టే సమయంలో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. దీంతో అప్పట్లో సస్పెన్షన్ ప్రక్రియ ముందుకు సాగలేదు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం కృష్ణయ్య తిరిగి విధుల్లో చేరారు. అయితే ఆయనపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు తాజాగా సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.