Reading Time: < 1 minute
Pm Modi Meets Lk Advani 25 Years In Government

బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్‌కే.అద్వానీని ప్రధాని మోడీ కలిశారు. ఆయన నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్య విషయాలపై ఆరా తీశారు. ప్రభుత్వాధినేతగా మోడీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భేటీ జరిగినట్లుగా తెలుస్తోంది. అద్వానీని మోడీ పరామర్శించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మోడీ.. ముఖ్యమంత్రిగా.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 25 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు తాను ఈ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఈ విజయం ఆత్మస్తుతికి సందర్భం కాదని.. కృతజ్ఞతలు తెలియజేయాల్సిన తరుణమని ప్రధాని మోడీ అన్నారు.