Reading Time: < 1 minute

‘రామప్పకు సింగ‌‌‌‌‌‌‌‌రేణి మైనింగ్ తో ముప్పు ఉండదు’ : సింగరేణి యాజమాన్యం

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప గుడికి సింగరేణి మైనింగ్ తో ముప్పు పొంచి ఉందని వస్తున్న వార్తలు కేవలం అపోహలు, అవాస్తవాలు మాత్రమేనని సింగరేణి యాజమాన్యం సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. బాధ్యతాయుతమైన రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న సింగరేణి ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప గుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం చేకూర్చబోదని, వార‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌త్వ సంప‌‌‌‌‌‌‌‌ద పరిరక్షణ‌‌‌‌‌‌‌‌కు క‌‌‌‌‌‌‌‌ట్టుబ‌‌‌‌‌‌‌‌డి ఉంటుంద‌‌‌‌‌‌‌‌ని తెలిపింది.

సింగరేణి ఆధ్వర్యంలో ములుగు జిల్లా వెంకటాపూర్  ఓపెన్ కాస్ట్  ప్రాజెక్టు విషయంలో శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాతే ముందుకు వెళ్లాలని నిర్ణయించామని స్పష్టం చేసింది. ఈ విషయంలో భారత పురావస్తు శాఖ, ఇతర ప్రతిష్టాత్మక సంస్థలు శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఇచ్చే నివేదికల ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. పర్యావరణహితమైన మైనింగ్ కు  మాత్రమే సింగరేణి ప్రాధాన్యం ఇస్తుందని  పున‌‌‌‌‌‌‌‌రుద్ఘాటించింది. 

©️ VIL Media Pvt Ltd.