Reading Time: < 1 minute
ఎంతకు తెగించావ్ మధుమిత.. వ్యాపారి కారెక్కి ఏం చేసిందో తెలుసా..?

సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికగా బాగా పాపులర్ అయిన యూట్యూబర్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మధుమితపై తమిళనాడు పోలీసులు దొంగతనం కేసు నమోదు చేశారు. కాంట్రాక్టర్‌ మెడలోని బంగారు గొలుసును చోరీ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్థానిక పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. తిరునెల్వేలి జిల్లాలోని కే.టీ.సీ. నగర్ ప్రాంతానికి చెందిన బిల్డింగ్ కాంట్రాక్టర్ పెచిముత్తు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. తిరునెల్వేలి జిల్లా కేటీసీ నగర్‌కు చెందిన పెచ్చిముత్తు (89) భవన నిర్మాణ కాంట్రాక్టర్‌.. ఆయనకు నాగర్‌కోవిల్‌కు చెందిన యూట్యూబర్‌ మధుమితతో పరిచయముంది. 2022లో కాంట్రాక్టర్ పెచిముత్తు తిరునెల్వేలి జిల్లా కోర్టు సమీపంలో వాహనం నడుపుకుంటూ వెళ్తుండగా, ఆ ప్రాంతంలో నిలబడి ఉన్న మధుమిత అతని వాహనం ఎక్కి ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత, అతను మధుమితను బస్ స్టాండ్ వద్ద దింపి, తన ఇంటికి వెళ్ళాడు. అక్కడ, ఆమె మెడలో ఉన్న సుమారు 5 సవర్ల బంగారు గొలుసు కనిపించకుండా పోయిందని చెబుతున్నారు. వెంటనే మధుమితకు ఫోన్‌ చేసి ప్రశ్నించగా.. పోలీసులకు చెబితే అవమానిస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.. ఈ మేరకు రాజాక్కమంగళం పోలీసులు మధుమితపై కేసు నమోదు చేశారు.

118 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ..

సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన మధుమిత కుటుంబంతో కలిసి నాగర్‌కోయిల్‌లో నివసిస్తున్నారు. ప్రముఖ యూట్యూబర్ అయినందున, ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌తో సహా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఖాతాలు ఉన్నాయి. వీటిలో, ఆమె వివిధ రకాల సాధారణ దుస్తులు, ఆభరణాలు ధరించి, డబ్బుల కట్టను పట్టుకుని, డబ్బులను వెదజల్లుతూ రీల్స్‌ను పోస్ట్ చేసేది. ఈ నేపథ్యంలో, సెప్టెంబర్ 24న మధుమిత తన భర్త, పిల్లలతో కలిసి బయటకు వెళ్లినప్పుడు, గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంట్లోకి ప్రవేశించి 118 సవర్ల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఈ ఘటనపై ఆదాయపన్ను శాఖ అధికారులు సైతం ఆమెపై దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనలకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు విచారణ అనంతరం వెల్లడించే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..