Reading Time: < 1 minute

మేడిపల్లి క్యారెట్ లేన్ జ్యూవెలరీ షాపులో భారీ చోరీ..! అర్థరాత్రి చొరబడి నగలు ఎత్తుకెళ్లారు..!

Caption of Image.

హైదరాబాద్ లోని మేడిపల్లి క్యారెట్ లేన్ జ్యూవెలరీ షాపులో భారీ చోరీ జరిగింది. అర్థరాత్రి షట్టర్ తొలగించి షాపులోని డైమండ్ నగలు, బంగారు నగలు ఎత్తుకెళ్లారు దుండగులు. సోమవారం ( అక్టోబర్ 5 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి… మేడిపల్లిలోని బోడుప్పల్ రోడ్ లో ఉన్న క్యారట్ లేన్ జ్యూవెలరీ షాపులో చొరబడి భారీగా బంగారు, డైమండ్ నగలు ఎత్తుకెళ్లారు దొంగలు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాపులోని సీసీటీవీ కెమెరాలు షాపు పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు పోలీసులు. క్లూస్ టీం సహకారంతో వేలిముద్రలు వంటి కీలక ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టాటా లాంటి దిగ్గజ సంస్థకు చెందిన జ్యూవెలరీ షాపులో చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది. ఘటన జరిగిన సమయంలో షాపు దగ్గర సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారా లేదా..? ఈ చోరీ వెనుక ఎవరి హస్తం ఉంది..? వంటి వివరాలు తెలియాల్సి ఉంది.  

©️ VIL Media Pvt Ltd.