Reading Time: 2 minutes

అగార్కర్‌పై విమర్శలు చేసిన వారికి గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్.. వీడ్కోలు నోట్ వైరల్!

Caption of Image.

Gautam Gambhir: భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir).. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవి నుంచి వైదొలిగిన అజిత్ అగార్కర్ (Ajit Agarkar)‌కు భావోద్వేగభరితమైన వీడ్కోలు పలికారు. అగార్కర్ పదవీకాలం అధికారికంగా ముగియడంతో, బీసీసీఐ (BCCI) కొత్త సెలక్షన్ కమిటీ సభ్యుడి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో గంభీర్ సోషల్ మీడియా వేదికగా అగార్కర్ సేవలను కొనియాడారు.

చరిత్ర మీపట్ల దయతో ఉంటుంది: గంభీర్ 

ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అజిత్ అగార్కర్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ గౌతమ్ గంభీర్ భావోద్వేగంతో కూడిన మెసేజ్ రాసుకొచ్చాడు. డియర్ అజిత్ భాయ్.. మీతో కలిసి పని చేయడం ఎంతో గౌరవంగా ఉంది, ఆ మూడు ఐసీసీ ట్రోఫీలే మీ నిబద్ధతకు నిదర్శనం.. ఎప్పుడూ టీమ్ ఫస్ట్ అనే సిద్ధాంతంతో పని చేశారు. నేను కచ్చితంగా చెప్పగలను.. చరిత్ర మీపట్ల మరింత దయతో ఉంటుంది.. మీ భవిష్యత్తు ప్రయత్నాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ గంభీర్ పేర్కొన్నాడు. అగార్కర్ హయాంలోని విమర్శలను ఉద్దేశించే గంభీర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

అగార్కర్ స్వర్ణయుగం – మూడు ఐసీసీ ట్రోఫీలు: 

జులై 4, 2023న భారత సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అగార్కర్.. తన మూడేళ్ల పదవీకాలాన్ని అక్టోబర్ 4వ తేదీతో ముగించారు. ఆయన హయాంలో భారత క్రికెట్ జట్టు అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. ఈ మూడు ఐసీసీ ట్రోఫీలను భారత్ గెలుచుకోవడంలో అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వ్యూహాలు కీలక పాత్ర పోషించాయి. అలాగే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కు కూడా టీమిండియా చేరింది.

* 2024 T20 ప్రపంచకప్
* 2025 ఛాంపియన్స్ ట్రోఫీ
* 2026 T20 ప్రపంచకప్

సాహసోపేత నిర్ణయాలు – వివాదాలు: 

అజిత్ అగార్కర్ తన పదవీకాలంలో ఎన్నో బోల్డ్, కొన్నిసార్లు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడలేదు. టెస్ట్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల శకానికి తెరదించుతూ యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. భారత్‌కు 2026 టీ20 వరల్డ్ కప్ అందించిన కొన్ని వారాలకే సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 జట్టు నుంచి తప్పించడం లాంటి పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువతకు పెద్దపీట వేయడమే ఆయన ప్రధాన విధానంగా ఉండేది. కానీ, తాజాగా భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీ మాత్రం ఆ ఆలోచనాలో మార్పును సూచిస్తోంది. ఇక అగార్కర్ పదవీకాలం ముగియడంతో, కొత్త సెలక్టర్ కోసం బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. మరి కొత్త చీఫ్ సెలెక్టర్ ఎవరవుతారనేది త్వరలో తేలనుంది. 

©️ VIL Media Pvt Ltd.