Reading Time: < 1 minute

హారర్ థ్రిల్లర్ సినిమా ‘పోతిరెడ్డిపల్లి’ షూటింగ్ మొదలు

Caption of Image.

పవన్, మౌనిక, సిరి లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం ‘పోతిరెడ్డిపల్లి’. అశోక్ రోయ్య దర్శకత్వంలో జేరమ్ విష్ణు నిర్మిస్తున్నారు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌‌‌‌‌‌‌‌లో పూజా కార్యక్రమాలతో ఈ మూవీ  ప్రారంభమైంది. తొలి షాట్‌‌‌‌‌‌‌‌కు సీనియర్ నటుడు బాబు మోహన్  క్లాప్ కొట్టగా, కొరియోగ్రాఫర్ ‘అమ్మ రాజశేఖర్’ కెమెరా స్విచాన్ చేశారు.

డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య గౌరవ  దర్శకత్వం వహించారు. దర్శకుడు వి. సముద్ర, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య  అతిథులుగా హాజరై టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ అందించారు. గ్రామీణ నేపథ్యంలో మిస్టరీ, హారర్, సస్పెన్స్ అంశాలతో ఈ  సినిమా తెరకెక్కుతోందని మేకర్స్ తెలియజేశారు.

©️ VIL Media Pvt Ltd.