Reading Time: < 1 minute

స్టాక్ మార్కెట్‌లో మళ్లీ జోష్.. 8 వారాల తర్వాత కోలుకున్న సెన్సెక్స్, నిఫ్టీ !

Caption of Image.

ఎనిమిది వారాల క్షీణత తర్వాత, స్టాక్ మార్కెట్ ఈరోజు(5 అక్టోబర్) పుంజుకుంది. ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 400 పాయింట్లు ఎగబాకి 72,340.95 వద్ద ప్రారంభమైంది. అదే సమయంలో నిఫ్టీ 22,532.40 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.

స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే, సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 17 పెరగగా, 13 తగ్గాయి. వీటిలో, బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా 1.82 శాతం పెరగగా, టెక్ మహీంద్రా అత్యధికంగా 1.36 శాతం తగ్గింది.  మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే, అంటే ఉదయం 9:34 గంటలకు, సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా పెరిగి 72,510.06 వద్ద ట్రేడైంది. 

ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీలో అత్యధిక లాభాలు, నష్టాల్లో ఉన్నవి ఏవంటే…
బజాజ్ ఫైనాన్స్ (1.82%), అదానీ పోర్ట్స్ (1.54%), HDFC బ్యాంక్ (1.31%), యాక్సిస్ బ్యాంక్ (1.12%), ITC (1.03%) సెన్సెక్స్‌లో టాప్ గెయినర్స్ గా ఉండగా… టెక్ మహీంద్రా (1.36%), ఎటర్నల్ (1.10%), సన్‌ఫార్మా (1.05%), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (0.50%), ఏషియన్ పెయింట్స్ (0.47%) అత్యధికంగా నష్టపోయినవిగా ఉన్నాయి.

నిఫ్టీలో అత్యధిక లాభాలు, నష్టాల్లో  ఉన్నవి ఏవంటే 
అత్యధిక లాభాలు పొందిన షేర్స్ బజాజ్ ఫైనాన్స్ (4.78%), టిసిఎస్ (2.60%), శ్రీరామ్ ఫైనాన్స్ (2.24%), టైటాన్ (2.06%), కోల్ ఇండియా (2.05%)…. నష్టాల్లో ఉన్నవి అపోలో హాస్పిటల్స్ (1.88%), సిప్లా (1.44%), HCL టెక్ (1.06%), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (0.99%), ఏషియన్ పెయింట్స్ (0.81%)
 

©️ VIL Media Pvt Ltd.