Reading Time: < 1 minute

పేదల గుండెల్లో కొలువైన మహనీయుడు కాకా : సీఎం రేవంత్ రెడ్డి

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: పేద ప్రజల హృదయాల్లో దీపంలా వెలిగిన మహనీయుడు గడ్డం వెంకటస్వామి అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం కాకా జయంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం స్మరించుకున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో కాకా ప్రజలకు విశేష సేవలందించారని కితాబిచ్చారు.

ముఖ్యంగా సింగరేణి కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణలో ఆయన చెరగని ముద్ర వేశారని గుర్తుచేశారు. కార్మికుల కష్టాలను స్వయంగా ఎరిగిన నాయకుడిగా, అణగారిన వర్గాల గొంతుకగా కాకా అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం కాకాకు అర్పించే నిజమైన నివాళి అని సీఎం స్పష్టం చేశారు. 

©️ VIL Media Pvt Ltd.