Reading Time: < 1 minute

ఆపదలు రావొచ్చు.. కొత్తగా అప్పులు చేయొద్దు: ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ముత్తుకృష్ణన్ సూచన

Caption of Image.

చెన్నై: ఎల్‎నినో సమస్యలు, భౌగోళిక రాజకీయ ఆందోళనలు, ఉద్యోగ కోతల వల్ల భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని చెన్నైకి చెందిన ఇన్వెస్ట్​మెంట్​ అడ్వైజర్​ ముత్తుకృష్ణన్​ దండపాణి చేసిన ‘ఎక్స్’​ పోస్ట్​ చర్చనీయాంశంగా మారింది.  

ఆందోళన చెందడానికి బదులుగా ఆర్థికంగా ఎదగాలని, కుటుంబ అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. మూడేళ్ల ఖర్చులను కవర్ చేసే విధంగా అత్యవసర నిధి లేదా సురక్షిత రిజర్వ్ ఏర్పాటు చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాలని చెప్పారు. 

‘‘అప్పుల భారాన్ని పెంచుకోవద్దు. కొత్తగా ఎలాంటి అప్పులూ తీసుకోవద్దు. రియల్ ఎస్టేట్ లేదా ఇల్లు కొనుగోలు వంటి దీర్ఘకాలిక కమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు వద్దు. జాబ్స్, రోల్స్ విషయంలో పంతాలకు పోకండి. ఆదాయాన్ని నిలబెట్టుకోవడంపై దృష్టిపెట్టాల్సిన సమయం ఇది’’ అని పేర్కొన్నారు. 

ప్రపంచం గతంలోనూ ఇటువంటి సంక్షోభాలను ఎదుర్కొందని, భవిష్యత్తులోనూ చూస్తుందని ఆయన వివరించారు. భయాందోళనలు అవసరం లేదని,  ముందస్తు ఆర్థిక జాగ్రత్తలు పాటించడం చాలా అవసరమని ముత్తుకృష్ణన్ స్పష్టం చేశారు.

©️ VIL Media Pvt Ltd.