Reading Time: < 1 minute

అక్టోబ‌ర్ 11 నుంచి 20 వ‌ర‌కు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Caption of Image.

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20వ తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అక్టోబర్ 7వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.భక్తులు ఈ టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

అక్టోబర్ 11 నుంచి 20 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమలలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అదే సమయంలో పెరటాసి మాసం చివరి వారం కావడంతో తిరుమలకు భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, డిఫెన్స్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి అక్టోబర్ 10 నుంచి 19వ తేదీ వరకు సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తమ తిరుమల యాత్రను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.

 

©️ VIL Media Pvt Ltd.