Reading Time: < 1 minute

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి దివ్య భారతి

Caption of Image.

తిరుమల: ప్రముఖ తమిళ హీరోయిన్ దివ్య భారతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఆమె స్వామివారి సేవలో పాల్గొని భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు.

శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో దివ్య భారతికి వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు ఆమెను శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఆలయం వెలుపల దివ్య భారతిని చూసిన భక్తులు, అభిమానులు ఆమెతో ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దివ్య భారతి.. శ్రీవారి సన్నిధిలో భక్తిభావంతో కనిపించారు.

©️ VIL Media Pvt Ltd.