Reading Time: < 1 minute

అధిక శక్తి న్యూట్రినోల ఆవిష్కరణకు.. ఫ్రాన్సిస్ హాల్జెన్‌కు ఫిజిక్స్ లో నోబెల్ బహుమతి

Caption of Image.

2026  సంవత్సరానికిగాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి బెల్జియన్- అమెరికన్ పార్టికల్ ఫిజిసిస్ట్ ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ హాల్జెన్ ను వరించింది. అంతరిక్షం నుంచి వచ్చే అత్యంత శక్తివంతమైన ఖగోళ న్యూట్రినోల ఆవిష్కరణ,  దక్షిణ ధ్రువంలో ఐస్‌క్యూబ్  న్యూట్రినోల అబ్జర్వేటరీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినందుకు గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నారు. 

ప్రస్తుతం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న 82 ఏళ్ల హాల్జెన్‌కు ఈ అవార్డుతో పాటు 12 మిలియన్ స్వీడిష్ క్రోనర్లు అంటే సుమారు రూ. 9.6 కోట్లు నగదు బహుమతి లభించనుంది. 

ఖగోళ న్యూట్రినోలను  ఘోస్ట్ పార్టికల్స్ అని పిలుస్తారు. ఇవి విశ్వంలో వేగంగా ప్రయాణిస్తూ, ఎటువంటి అడ్డంకులు లేకుండా దేనిలోకైన  భూమి, మానవ శరీరాలలో  సైతం దూసుకెళ్లగలవు. వీటిని గుర్తించడం అత్యంత కష్టం.  హాల్జెన్ నాయకత్వంలో అంటార్కిటికా మంచు కింద ఒక ఘన కిలోమీటరు వైశాల్యంలో వేలాది ఆప్టికల్ సెన్సార్లతో IceCube అనే ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రినో డిటెక్టర్‌ను నిర్మించారు. ఇది సుదూర విశ్వం, బ్లాక్‌హోల్స్ నుంచి వచ్చే అధిక శక్తి న్యూట్రినోలను విజయవంతంగా బంధించి సరికొత్త ఖగోళ పరిశోధనలకు నాంది పలికింది. 

©️ VIL Media Pvt Ltd.