Reading Time: < 1 minute

రెట్టింపు మ్యాడ్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌తో హుషారు 2

Caption of Image.

2018లో యూత్‌‌‌‌‌‌‌‌లో మంచి క్రేజ్‌‌‌‌‌‌‌‌ సొంతం చేసుకున్న ‘హుషారు’కు సీక్వెల్‌‌‌‌‌‌‌‌గా ‘హుషారు 2’ తెరకెక్కుతోంది. దర్శకుడు శ్రీ హర్ష కోనుగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన టైటిల్ అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. రెట్టింపు ఫన్, మ్యాడ్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌తో యూత్‌‌‌‌‌‌‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

రాహుల్ రామ‌‌‌‌‌‌‌‌కృష్ణ, అశోక్ గ‌‌‌‌‌‌‌‌ల్లా, ర‌‌‌‌‌‌‌‌వి అంథోని, దినేష్ తేజ్‌‌‌‌‌‌‌‌, శ‌‌‌‌‌‌‌‌శిధ‌‌‌‌‌‌‌‌ర్ కోచ‌‌‌‌‌‌‌‌ర్లకోట‌‌‌‌‌‌‌‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని  రాహుల్ వ‌‌‌‌‌‌‌‌ర్మ, కె.వీణా రాణి, కె.హ‌‌‌‌‌‌‌‌నుమంత్ రాజు కలిసి నిర్మిస్తున్నారు.  స‌‌‌‌‌‌‌‌న్ని ఎం.ఆర్‌‌‌‌‌‌‌‌ సంగీతం అందిస్తుండగా, రామ్ మిర్యాల   అడిష‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ల్ మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తున్నాడు.  ఈ ఏడాది చివర్లో  థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని  మేకర్స్ తెలియజేశారు.

©️ VIL Media Pvt Ltd.