Reading Time: < 1 minute

ఓటీటీలోకి వచ్చేసిన ‘స్పైడర్-మేన్: బ్రాండ్ న్యూ డే’.. హాలీవుడ్ సెన్సేషన్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Caption of Image.

టామ్ హాలండ్, జెండేయా, సేడీ సింక్, మార్క్ రుఫాలోల కాంబోలో డెస్టిన్ డేనియల్ క్రిట్టన్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్  ‘స్పైడర్-మేన్: బ్రాండ్ న్యూ డే’ (Spider-Man: Brand New Day) . బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ హాలీవుడ్  మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 20 వేల కోట్లకు పై వసూళ్లు రాబట్టింది. ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన 3వ అతిపెద్ద మూవీగా ‘అవతార్ 2’, ‘టైటానిక్’ రికార్డులను పాతరేసిన బ్లాక్‌బస్టర్ గా నిలిచింది.

థియేటర్లను షేక్ చేసిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ లోకి అడుగుపెట్టేంసింది. అక్టోబర్ 6 అర్ధరాత్రి 12 గంటల నుంచి Apple TV, Prime Video, Fandango వేదికలపై PVOD విధానంలో అందుబాటులోకి వచ్చింది. అంటే ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో చూడాలంటే ఈమూవీని రెంట్ విధానంలో  కొనుగోలు చేయాల్సిందే.
 
అమెరికాలో డిజిటల్ కొనుగోలుకు $29.99, రెంట్‌‌కు $24.99 నిర్ణయించగా.. భారతీయ మార్కెట్లో కేవలం రూ. 299కే ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే జియో హాట్ స్టార్ లో కూడా స్ట్రీమింగ్ కానుంది. యూఎస్‌లో సోనీ-నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం ప్రకారం ముందుగా నెట్‌ఫ్లిక్స్‌లో, ఆ తర్వాత డిస్నీ+లో సందడి చేయనుంది.

ఇక ఈ సినిమాను తమ హార్డ్ డిస్క్,  కలెక్షన్ డిస్క్‌గా భద్రపరచుకోవాలనుకునే ఫ్యాన్స్ కోసం 4K Ultra HD, Blu-ray ఫిజికల్ ఎడిషన్ల ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇవి డిసెంబర్ 15, 2026న మార్కెట్‌లోకి రానున్నాయి.

ALSO READ : నయనతార వైట్ బికినీ ఫొటోలు వైరల్..

పీటర్ పార్కర్‌గా అందరి జ్ఞాపకాల్లోంచి తుడిచిపెట్టుకుపోయాక.., తన కొత్త జీవితాన్ని నిర్మించుకోవడానికి స్పైడీ చేసే పోరాటమే ఈ మూవీ కథ. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడటం మిస్సయినా, మళ్లీ ఆ మ్యాజిక్‌ను హోమ్ థియేటర్‌లో ఎంజాయ్ చేస్తూ చూడవచ్చు. మరి ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

 

©️ VIL Media Pvt Ltd.