Reading Time: < 1 minute

న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‎కు స్టార్ పేసర్ ఆకాశ్‌‌‌‌ దీప్ రీ ఎంట్రీ..! 

Caption of Image.

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌‌‌‌ పర్యటన కోసం ఇండియా జట్లను త్వరలోనే ప్రకటించనున్నారు. వీపు గాయం నుంచి కోలుకున్న పేసర్‌‌‌‌ ఆకాశ్‌‌‌‌ దీప్‌‌‌‌ టెస్ట్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. వీపు గాయంతో ఏడు నెలలు ఆటకు దూరమైన ఆకాశ్‌‌‌‌ ఇరానీ కప్‌‌‌‌లో ఆకట్టుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌‌‌‌ల్లో కలిపి 6 వికెట్లు తీశాడు. 

గంటకు 138, 140 కేఎంపీహెచ్‌‌‌‌ వేగంతో బాల్స్‌‌‌‌ వేస్తుండటంతో అతను పూర్తి ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ సాధించినట్లుగా సెలెక్టర్లు భావిస్తున్నారు. షార్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌ జట్ల విషయానికొస్తే పెద్దగా మార్పులు చేసే చాన్స్‌‌‌‌ లేదు. ఆసియా క్రీడలతో పాటు వెస్టిండీస్‌‌‌‌తో సిరీస్‌‌‌‌ల్లో ఆడిన ప్లేయర్లను దాదాపుగా పరిగణనలోకి తీసుకోనున్నారు. 

అయితే, టెస్ట్‌‌‌‌ సన్నాహకాల దృష్ట్యా కెప్టెన్‌‌‌‌ శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌కు ముందుగానే విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నారు. అదే జరిగితే చివరి రెండు వన్డేలకు శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ సారథ్యం వహించనున్నాడు. ఎందుకంటే చివరి వన్డే ముగిసిన నాలుగు రోజుల్లోనే టెస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ ప్రారంభమవుతుంది. 

గిల్‌‌‌‌తో పాటు యశస్వి జైస్వాల్‌‌‌‌, కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌, బుమ్రా, సిరాజ్‌‌‌‌, నితీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ అన్ని ఫార్మాట్లలో ఆడే అవకాశం ఉంది. సెలెక్టర్‌‌‌‌ ప్రజ్ఞాన్‌‌‌‌ ఓజా నేతృత్వంలోని నలుగురు సభ్యుల సెలెక్షన్‌‌‌‌ కమిటీ త్వరలోనే భేటీ అయ్యి జట్లను ప్రకటించనుంది. కివీస్‌‌‌‌ పిచ్‌‌‌‌లపై పేస్‌‌‌‌ దళాన్ని బలోపేతం చేసే దిశగా సెలెక్టర్లు అడుగులు వేయనున్నారు. 

©️ VIL Media Pvt Ltd.