Reading Time: < 1 minute
Tgsrtc Strike Alert Rtc Employees Likely To Go On Strike In 48 Hours In Telangana

TGSRTC Strike Alert: తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో 48 గంటల్లో సమ్మె సైరన్ మోగించే అవకాశముందని RTC కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే డిపోల స్థాయిలో సమ్మెకు సన్నాహాలు పూర్తయ్యాయని, అవసరమైతే ఎప్పుడైనా ఆందోళన ప్రారంభిస్తామని RTC జేఏసీ నేతలు తెలిపారు. ఇదిలా ఉంటే, సమ్మె అంశాన్ని ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు RTC జేఏసీని అధికారిక చర్చలకు ఆహ్వానించకపోవడం కార్మికుల్లో అసంతృప్తిని పెంచుతోంది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం విలీనం, యూనియన్ల పునరుద్ధరణ మినహా మిగతా డిమాండ్లపై సానుకూలంగా ఉన్నామని చెబుతున్నాయి.

Cream Cheese Kunafa Recipe: రెస్టారెంట్స్ లో డబ్బులు వేస్ట్.. ఇంట్లోనే సూపర్ టేస్టీ ‘క్రీమ్ చీజ్ కునాఫా’ చేసేయండి ఇలా.!

సమ్మె ప్రారంభమైతే ప్రజారవాణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. లక్షలాది ప్రయాణికులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. అద్దె బస్సులతో పాటు పాఠశాల బస్సులను కూడా వినియోగించుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక సమ్మెను నివారించేందుకు కూడా కీలక చర్చలు జరగనున్నాయి. రేపు మంత్రి పొన్నం, RTC ఉన్నతాధికారులతో RTC జేఏసీ నాయకుల మధ్య సమావేశం జరిగే అవకాశముంది. ఈ చర్చల్లో సానుకూల ఫలితాలు వస్తాయా? లేక సమ్మె తప్పదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Minor Girl Cheating: ఇన్‌స్టాగ్రామ్ మాయలో మైనర్ బాలిక.. ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. లక్షలు దోచుకున్న వ్యక్తి అరెస్ట్..!