Reading Time: < 1 minute

ముఖం చూపించని టీచర్లకు షోకాజ్..రంగారెడ్డి జిల్లాలో 68 మందికి జారీ 

Caption of Image.

ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో ఫేషియల్​ రికగ్నైషన్ ​ద్వారా హాజరు నమోదు చేయని 68 మంది టీచర్లకు డీఈవో వెంకటేశ్వర్లు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గత నెల ఎఫ్‌‌ఆర్‌‌ఎస్‌‌లో హాజరు ఎందుకు నమోదు చేయలేదో చెప్పాలని వారిని డీఈవో ఆదేశించారు. స్కూల్స్​లో టీచర్లు సమయానికి రావడాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఎఫ్ఆర్ఎస్ ​అమలు చేస్తున్నామని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు.   

©️ VIL Media Pvt Ltd.