Reading Time: < 1 minute

ఫ్యామిలీ ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌ తో ‘సరిపోయారు ఇద్దరూ’

Caption of Image.

మేఘాంశ్ శ్రీహరి, యశ్విన్ వేగేశ్న లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న రూపొందించిన చిత్రం ‘సరిపోయారు ఇద్దరూ’. రాజేంద ప్రసాద్, వీకే నరేష్ కీలకపాత్రలు పోషించారు.  రిద్ధి కుమార్, మేఘా చౌదరి హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌.  తాజాగా ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేసి టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్‌‌‌‌‌‌‌‌ తెలియజేశాడు.  

వైజాగ్‌‌‌‌‌‌‌‌ సిటీలో పచ్చని పల్లెటూరి బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో ప్రేమ, స్నేహం, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌తో కట్ చేసిన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకుంది. టీజర్ ప్రారంభంలో స్నేహితులుగా కనిపించిన రాజేంద్ర ప్రసాద్‌‌‌‌‌‌‌‌, వీకే నరేష్ చివర్లో ఎందుకు శత్రువులు అయ్యారనేది ఆసక్తి కలిగించింది. యూత్‌‌‌‌‌‌‌‌తో పాటు ఫ్యామిలీస్‌‌‌‌‌‌‌‌కు నచ్చేలా సినిమా ఉండబోతోందని మేకర్స్‌‌‌‌‌‌‌‌ చెబుతున్నారు.  అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు.  సాదత్, ముని శివ నిర్మించారు.  త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

©️ VIL Media Pvt Ltd.