
PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీపై సెర్బియా మాజీ అధ్యక్షుడు అలెగ్జాండర్ వుచిచ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మోడీపై ప్రశంసలు కురిపించిన ఆయన, ఇదే సమయంలో మోడీని బలహీనపరిచేందుకు, ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. మోడీ నాయకత్వంతో భారత్ అంతర్జాతీయ వేదికపై కీలక శక్తిగా ఎదిగిందని అన్నారు. ఓ పోడ్‌కాస్ట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వుచిచ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా దేశానికి సేవలందిస్తూ 25 ఏళ్ల మైలురాయిని చేరుకున్నారని ప్రశంసించారు.
‘‘నరేంద్ర మోడీ వంటి నాయకుడిని బలహీన పరిచేందుకు ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోడీ భారత్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. మహాత్మా గాంధీ బోధనలను అనుసరించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు’’ అని అన్నారు. మోడీ కారణంగానే ప్రపంచవేదికపై భారత ప్రాధాన్యత పెరిగిందని వుచిచ్ పేర్కొన్నారు. భారత్ ఒక గొప్ప శక్తిగా ఎదిగిందని, మోడీ ఎన్నో గొప్ప పనులు చేశారని, అయినప్పటికీ ఆయన విఫలమయ్యారని, ఆయనకు ఏమీ తెలియదని చెప్పడం ద్వారా ఆయనను కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.
అయితే, మోడీని ఎవరు బలహీనపరుస్తున్నారో, ఆ ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయనే వివరాలను ఆయన ప్రస్తావించలేదు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోను బీజేపీ శ్రేణులు షేర్ చేస్తున్నాయి. ప్రపంచ నాయకులు మోడీ గురించి ఇలా మాట్లాడుతున్నారంటే అన్నీ అర్థమవుతున్నాయి, మోడీ నాయకత్వంలో భారత్ ఎదుగుతోందని, దీనిని ప్రపంచం గమనిస్తోందని బీజేపీ పేర్కొంది. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ), విపక్షాలు ఆందోళన నిర్వహిస్తున్న ఈ సమయంలో వుచిచ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
“𝐏𝐌 𝐌𝐨𝐝𝐢 𝐡𝐚𝐬 𝐫𝐚𝐢𝐬𝐞𝐝 𝐈𝐧𝐝𝐢𝐚 𝐭𝐨 𝐭𝐡𝐞 𝐡𝐞𝐚𝐯𝐞𝐧𝐬. 𝐓𝐨𝐝𝐚𝐲, 𝐈𝐧𝐝𝐢𝐚 𝐢𝐬 𝐢𝐦𝐩𝐨𝐫𝐭𝐚𝐧𝐭 𝐨𝐧 𝐭𝐡𝐞 𝐠𝐥𝐨𝐛𝐚𝐥 𝐬𝐭𝐚𝐠𝐞 𝐛𝐞𝐜𝐚𝐮𝐬𝐞 𝐨𝐟 𝐏𝐌 𝐌𝐨𝐝𝐢. 𝐇𝐞 𝐡𝐚𝐬 𝐝𝐨𝐧𝐞 𝐚 𝐭𝐫𝐞𝐦𝐞𝐧𝐝𝐨𝐮𝐬 𝐣𝐨𝐛.”
– President of Serbia
When world leaders speak like this about our Prime Minister, it says everything. India under PM Modi is rising, and the world is taking notice.
#25YearsOfSeva
— BJP (@BJP4India) October 7, 2026