Reading Time: < 1 minute
నీకు ప్రాణ హాని ఉందని చెబితే.. సల్మాన్ లైట్ తీసుకున్నాడు

సెలబ్రిటీల జాతకాలతో సోషల్ మీడియాలో తెగ పాపులారిటీ సంపాదించిన వేణు స్వామి.. ఆ పాపులారిటీతో పాటు విపరీతంగా ట్రోల్ అయ్యాడు. జాతకాల పేరుతో సెలబ్రిటీలను ఎయిమ్ చేస్తున్నాడని.. వారిని మానసికంగా బాధకు గురిచేస్తున్నాడనే కామెంట్ తెచ్చుకున్నారు. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌కు వెళ్లిన వేణు స్వామి.. సెలబ్రిటీల గురించి ఎందుకు వివాదాస్పదంగా జాతకాలు చెబుతారంటూ ప్రశ్న ఎదుర్కొన్నాడు. ఈ ప్రశ్నకు సల్మాన్‌ ఖాన్‌తో జరిగిన ఓ సంఘటనను వివరిస్తూ ఆన్సర్ ఇచ్చాడు వేణుస్వామి. సల్మాన్ ఖాన్‌కు సెప్టెంబర్ తర్వాత రాచపుండు రాబోతుందని స్వయంగా వాళ్ల తమ్ముడితో ఫోన్లో మాట్లాడి చెప్పానని వేణు స్వామి గుర్తు చేసుకున్నాడు. అయితే తాను అలా చెప్పినా కూడా సల్మాన్‌ సోదరుడు లైట్ తీసుకుని ‘ఐ విల్ టేక్ కేర్’ అంటూ బదులిచ్చాడని చెప్పుకొచ్చాడు.కానీ అదే మాట మన లోకల్ వాళ్లకు చెబితే అంత ఈజీగా తీసుకోరంటూ చెప్పుకొచ్చాడు వేణు స్వామి. సమాజంలో ఒక స్థాయికి ఎదిగిన పెద్ద వ్యక్తులు దెబ్బతింటే వారిపై ఆధారపడ్డ ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయని.. అందుకే వాళ్లను కాపాడాలనే ఉద్దేశంతోనే తాను అలా హెచ్చరిస్తున్నా అంటూ తన వివాదాస్పద జ్యోతిష్యాన్ని సమర్తించుకున్నాడు వేణు స్వామి. అంతేకాదు రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 తనకు ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛ మేరకే తాను జాతకాలు చెబుతున్నా అంటూ వివరణ ఇచ్చాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Venu Swamy: నేను సన్నీ లియోన్ లాంటోడిని..

లైన్ క్రాస్ చేసిన కార్తీ…తమిళ థియేటర్‌ ఓనర్లు సీరియస్

ఆడదని ముందే తెలుసు…పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

బట్టలు తీసుకుందామని కబోర్డ్‌ ఓపెన్‌ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్‌ చూసి హడల్‌

ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ను పరామర్శించిన దుబాయ్‌ రాజు