Reading Time: 2 minutes
Chhattisgarh Man Throws Almonds On Officers Desk Over Missing Property File In Bilaspur

పౌరులకు సేవలందించాల్సిన ప్రభుత్వ అధికారులు కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. వివిద అసరాల నిమిత్తం ఆఫీసులకు వచ్చే ప్రజలను చెప్పులు అరిగేలా తిప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు కొందరు అధికారులు. ఇదేవిధంగా ఓ ప్రభుత్వ అధికారిని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ యువకుడు వినూత్న నిరసనకు తెరలేపాడు. బాదం ను అధికారిని టేబుల్ పై విసిరి నిరసన తెలిపాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్లోని హౌసింగ్ బోర్డ్ కార్యాలయంలో జరిగింది.

Also Read:AP Weather Alert: ఏపీలో డబుల్ అలర్ట్.. రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన వర్షాలు.. ఆ జిల్లాల్లో ఎండలు..

ఒక సంవత్సరం కాలంగా తన ప్రాపర్టీ మ్యుటేషన్ ఫైల్ కనిపించకపోవడంతో ఆగ్రహం చెందిన యువకుడు, సబ్-రిజిస్ట్రార్ అధికారి డెస్క్ మీద 500 గ్రాముల బాదం చల్లి, “ఇవి తిని మీ మెమరీ మెరుగుపరచుకోండి, నా ఫైల్ ఎక్కడ ఉందో గుర్తు చేసుకోండి” అని అధికారిణిపై ఫైర్ అయ్యాడు. యువకుడి పేరు తరుణ్ సాహు. ఒక సంవత్సరం క్రితం తన ఆస్తి సంబంధిత ఫైల్‌ను సబ్-రిజిస్ట్రార్ (డెప్యూటీ రిజిస్ట్రార్) కార్యాలయంలో సమర్పించాడు. కానీ ఫైల్ కనిపించడం లేదని, అధికారులు ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందాడు. తన ఆవేదనను వ్యక్తం చేయడానికి తరుణ్ ప్రత్యేక మార్గం ఎంచుకున్నాడు. బాదం మెదడు శక్తిని, మెమరీని మెరుగుపరుస్తుందని ప్రజలు నమ్మడం ఆధారంగా, 500 గ్రాముల బాదం ప్యాకెట్ తీసుకెళ్లి అధికారి (పూనం బంజారే) డెస్క్ మీద చల్లాడు.

Also Read:CSK Vs SRH: టాస్ గెలిచిన సీఎస్కే.. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్.. ఇరు జట్లలోకి కొత్త ప్లేయర్లు..

“మేడమ్, ఈ బాదం తిని మీ మెమరీ షార్ప్ చేసుకోండి. నా ఫైల్ ఎక్కడ ఉందో గుర్తు చేసుకుని నాకు తెలియజేయండి” అని అన్నాడు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు ఈ నిరసనను “స్మార్ట్ & హ్యూమరస్ ప్రొటెస్ట్”గా ప్రశంసిస్తున్నారు. మరికొందరు ప్రభుత్వ కార్యాలయాల్లోని నిర్లక్ష్యం, ఫైల్‌లు కోల్పోవడం వంటి సమస్యలను ఎత్తి చూపుతున్నారు. ఈ ఘటన ప్రభుత్వ యంత్రాంగంలోని లోపాలను మళ్లీ ఒకసారి చర్చనీయాంశం చేసింది.