Reading Time: < 1 minute
PM Modi: కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. ఆ సంచలన ప్రకటన ఏంటి? దేశవ్యాప్తంగా ఉత్కంఠ!

PM Modi Addresses Nation Live Updates: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు రాత్రి 8:30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ హఠాత్తు పరిణామంతో దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారంటే ఏదో ఒక కీలక నిర్ణయం లేదా ప్రకటన ఉంటుందని గత అనుభవాలు చెబుతున్నాయి.

131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తరువాత మోదీ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే.. విపక్షాల తీరును కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ తప్పు పట్టారు. విపక్షాల తీరుపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడే అవకాశం ఉంది. అంతేకాకుండా.. పార్లమెంట్ సమావేశాల్లో జరిగిన పరిణామాలు.. అదేవిధంగా బిల్లులకు మద్దతు ఇవ్వకపోవడం సహా.. పలు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుధీర్ఘంగా ప్రసంగించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి