Reading Time: < 1 minute
10th Class Result 2026 Date: విద్యార్ధులకు అలర్ట్.. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే

హైదరాబాద్‌, ఏప్రిల్ 18: తెలంగాణ రాష్ట్ర పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ 16వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు నెల రోజలపాటు కొనసాగి ఏప్రిల్ 16తో ముగిశాయి. మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇక ఏప్రిల్ 1వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 23వ తేదీతో అంటే మరో వారంలో మూల్యాంకనం ప్రక్రియ ముగియనుంది. ఆ తర్వాత 10 రోజులపాటు మార్కుల నమోదు ప్రాసెస్‌ జరుగుతుంది. అనంతరం మే మొదటి వారంలో పదో తరగతి ఫలితాలు వెల్లడిస్తారు. అందిన సమాచారం మేరకు మే 4 లేదా5 తేదీల్లో పదో తరగతి ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఈ మేరకు త్వరలోనే పాఠశాల విద్యాశాఖ ప్రకటన వెలువరించనుంది.

ఎస్సెస్సీ బోర్డు ఈ విద్యాసంవత్సరం నుంచి అధికారిక వెబ్‌సైట్‌తోపాటు టెన్త్‌ ఫలితాలు వాట్సాప్‌లోనూ తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఇప్పటికే హాల్‌టికెట్లను సైతం వాట్సాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించిన బోర్డు ఫలితాలను సైతం వాట్సాప్‌ ద్వారా తెలుసుకొనే సదుపాయం కల్పించింది. వాట్సాప్‌ ద్వారా హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకొన్న వారి మొబైల్‌ నంబర్‌కు ఆటోమెటిక్‌గా మెమో కూడా వెళుతుంది. వాట్సప్‌ ద్వారా రిజల్ట్స్ డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే 80969 58096 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్‌ పంపించాలి. ఆ తర్వాత ఎస్సెస్సీ రిజల్ట్స్‌ అని టైప్‌చేసి హాల్‌టికెట్‌ నంబర్‌, ఇతర వివరాలు నమోదు చేయాలి. ఆ వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. ఇక అటు ఏపీలోనూ పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలోనే విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.