మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రాశిలో రవి ఉచ్ఛ స్థితిలో ఉండడం, ధనాధిపతి శుక్రుడు ధన స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల ఈ రాశివారికి ఈ వారమంతా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. ఆదాయం బాగా వృద్ధిచెందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతి లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలకు కొరత ఉండదు. నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. ఖర్చుల విషయంలోనూ, మాట తొందరపాటు విషయంలోనూ జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడితో సహా మూడు శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ప్రతి ప్రయత్నమూ కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు పూర్తయి, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలను తొలగించుకుంటారు. వృత్తి జీవితంలో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఆదా యం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశ్యధిపతి బుధుడికి గురువుతో పరివర్తన జరిగినందువల్ల, లాభ స్థానంలో రవి ఉన్నందువల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. పలుకుబడి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయానికి లోటుండదు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నీ కొద్ది ప్రయత్నంతో పూర్తవుతాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, ప్రయత్నాలు తప్ప కుండా సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో మెప్పిస్తారు. వ్యాపా రాలు అనుకూల ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. విద్యార్థులు చదువుల్లో దూసుకుపోతారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): లాభ స్థానంలో రాశ్యధిపతి చంద్రుడు, శుక్ర గ్రహాల యుతి వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. రావలసిన సొమ్ము తప్పకుండా చేతికి అంది ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలను పూర్తిగా చక్కబెడతారు. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కొంత ఒత్తిడి ఉంటుంది. బంధుమిత్రుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఇతరులను అతిగా నమ్మకపోవడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): లాభ స్థానంలో గురువు, భాగ్య స్థానంలో రాశ్యధిపతి రవి, దశమ స్థానంలో శుక్రుడు ఉన్న కారణంగా వారం రోజుల జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. గృహ, వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. బంధుమిత్రులకు సహాయపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ బాధ్యతలను పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమపడతారు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): రాశ్యధిపతి బుధుడికి గురువుతో పరివర్తన ఏర్పడినందువల్ల, భాగ్య స్థానంలో శుక్రుడి ప్రవేశం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కొన్ని శుభ ఫలితాలు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చాలావరకు చేతికి అందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో, ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం శ్రేయస్కరం కాదు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించవచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రాశ్యధిపతి శుక్రుడు సప్తమంలో బాగా అనుకూలంగా ఉండడం, భాగ్య స్థానంలో గురువు సంచా రం వల్ల వారమంతా ప్రశాంతంగా, హాయిగా గడిచిపోతుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో ఎక్కు వగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఉద్యోగులు షేర్ల మీద భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. విద్యార్థులు చదువుల్లో విజయాలు సాధిస్తారు. ప్రేమ జీవితంలో దూసుకుపోతారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): పంచమ స్థానంలో రాశ్యధిపతి కుజుడు, సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాధ్యతలు పెరగడంతో పాటు తప్పకుండా పురోగతి ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. షష్ట స్థానంలో రవి ఉచ్ఛస్థితి వల్ల గౌరవ మర్యాదలకు, మంచి పరిచయాలకు లోటుండదు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. తల్లితండ్రుల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. విద్యార్థులకు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): సప్తమ స్థానంలో రాశ్యధిపతి గురువు సంచారం, పంచమ స్థానంలో రవి ఉచ్ఛస్థితి వల్ల వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల ఒత్తిడి చాలావరకు తగ్గిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మీ నిర్ణయాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాల్ని సందర్శిస్తారు. విదేశాల నుంచి సానుకూల సమాచారం అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. పరిచయస్థులలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): తృతీయంలో శని, బుధులు, పంచమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల అనుకోకుండా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబసమేతంగా విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరగవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఏలిన్నాటి శని ప్రభావం వల్ల ప్రతి పనీ నిదానంగా పూర్తవుతుంది. కొద్దిపాటి వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. కొన్ని ప్రయత్నాలు వాయిదా పడే అవకాశం కూడా ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. పంచమ స్థానంలో గురువు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరాభిమానాలు లభిస్తాయి. వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో పురోగమిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి నుంచి సలహాలు ఉపయోగపడతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. విద్యార్థులు ఎంత శ్రమపడితే అంత మంచిది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ రాశికి ప్రస్తుతం కుజ, గురు, శుక్రుల బలం ఎక్కువగా ఉన్నందువల్ల సర్వత్రా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా ఆశించిన స్థాయిలో సఫలం అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో దూసుకుపోతారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధాల విషయంలో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. అనారోగ్యాల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగం మారే ప్రయత్నాలకు తగిన స్పందన లభిస్తుంది. విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.











