
కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కిన ఖడ్గం మూవీ అప్పట్లో సూపర్ డూపర్ హిట్టైంది. ఇప్పటికీ టీవీల్లో టెలీకాస్ట్ అయిన ప్రతీ సారి మంచి టీఆర్పీని తెచ్చుకుంటూ ఉంటుంది. యూట్యూబ్‌లోనూ ఈ మూవీ సీన్స్‌కి సాంగ్స్‌కి.. మంచి రెస్పాన్ వస్తుంటుంది. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ విషయం బయటికి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఖడ్గం సినిమాకి వన్ ఆఫ్ ది హైలెట్ క్యారెక్టర్ శ్రీకాంత్ క్యారెక్టర్. ఇంటెన్సివ్ లుక్స్‌తో.. కూల్, అండ్ యాంగ్రీ మ్యాన్‌గా కనిపించిన శ్రీకాంత్.. ఈ సినిమాలోని తన పర్ఫార్మెన్స్‌తో అందర్నీ ఫిదా చేశాడు. అయితే ఈ క్యారెక్టర్ కోసం… ముందు శ్రీకాంత్ కాకుండా నాగార్జునను అనుకున్నారట. నిర్మాతల వైపు నుంచి నాగార్జున ను తీసుకోవాలనే సూచన ఈ మూవీ బిగినింగ్‌లో కృష్ణవంశీకి వచ్చిందట. అయితే నాగార్జున లాంటి స్టార్ నటుడిని తీసుకుంటే సినిమాకు మంచి బడ్జెట్ వస్తుందని నిర్మాతలు భావించారట. అయితే ప్రొడ్యూసర్ వాదనతో తాను విభేదించినట్టు.. దర్శకుడు కృష్ణవంశీ తన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు. నాగార్జున వంటి స్టార్ నటుడు వస్తే సినిమా బడ్జెట్ ఎక్కువవుతుందని, అంతేకాకుండా, సినిమాలో రెండు ముఖ్యమైన పాత్రలు ఉండటం వల్ల నాగార్జున స్టార్‌డమ్ ఆ పాత్రల మధ్య సమతుల్యతను దెబ్బతీస్తుందని కృష్ణవంశీ ఫీల్ అయ్యాడట. ఇదే విషయాన్ని ప్రొడ్యూసర్‌కు వివరించి.. నాగార్జున కాకుండా.. శ్రీకాంత్‌ను తన రోల్ కోసం తీసుకున్నాడట కృష్ణవంశీ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Minister Nara Lokesh: TDP నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ కు బాధ్యతలు
Andhra Pradesh: చేపల కోసం చెరువులోకి వల వేసాడు.. దొరికింది చూసి స్టన్ అయ్యాడు..
Singer Mangli Case: సింగర్ మంగ్లీ కేసులో బిగ్ ట్విస్ట్