ఈ వారంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. సోమవారం నుంచి ధరల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. దీంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ మొదలుకావడంతో పసిడి కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో రేట్లు పెరగడం బ్యాడ్న్యూస్గా చెప్పవచ్చు. గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
గురువారం హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,55,570 వద్ద కొనసాగుతోండగా.. బుధవారం రూ.1,55,350 వద్ద స్ధిరపడింది. నిన్నటితో పోల్చుకుంటే రూ.220 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,42,600 వద్ద కొనసాగుతోండగా.. బుధవారం రూ.1,42,400 వద్ద కొనసాగింది. నిన్నటితో చూస్తే రూ.200 పెరిగింది.
అటు చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,230 వద్ద ఉండగా.. నిన్న రూ.1,56,220 వద్ద స్థిరపడ్డాయి. ఇక 22 క్యారెట్ల ధర గురువారం రూ.1,43,210 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.1,43,200 వద్ద స్థిరపడింది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,570 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,600 వద్ద ఉంది.
అటు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,55,720 వద్ద ఉండగా.. బుధవారం రూ.1,55,500 వద్ద ఉంది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,750 వద్ద ఉండగా.. నిన్న రూ.1,42,550 వద్ద స్థిరపడింది. అటు వెండి ధరలు కూడా పెరిగాయి.
ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,70,100 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.2.70 లక్షలుగా ఉంది. ఇక హైరదాబాద్లో కేజీ సిల్వర్ ధర రూ.2,75,100 వద్ద ఉండగా.. నిన్న రూ.2.75 లక్షల వద్ద ఉంది. అటు చెన్నైలో కేజీ సిల్వర్ ధర రూ.2,75,100 వద్ద కొనసాగుతున్నాయి.




