క్రాసులా: క్రాసులా మొక్కను మనీ ట్రీ లేదా సక్సెస్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. దీని దట్టమైన, గుండ్రని ఆకులు ఆర్థిక స్థిరత్వానికి చిహ్నాలు. ఇది అయస్కాంతంలా సంపదను ఆకర్షిస్తుందని నమ్ముతారు. ఈ మొక్కను ఇంటి ప్రవేశ ద్వారం వద్ద లేదా ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి.
మనీ ప్లాంట్ : దాదాపు ప్రతి ఇంట్లో కనిపించే ఈ మొక్క, సానుకూల శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనీ ప్లాంట్ ఎప్పుడూ పచ్చగా ఉండాలి. ఇది ఎండిపోతే ఆర్థిక ఇబ్బందులకు సంకేతంగా భావిస్తారు. ఇంటి లోపల లేదా బాల్కనీలో పెంచడం వల్ల కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి.
శమీ మొక్క : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శమీ వృక్షానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనికి శని దేవుడు, వినాయకుడి అనుగ్రహం ఉంటుందని చెబుతారు.
శని దోషాలను నివారించి, పనుల్లో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది. దసరా పండుగ రోజున ఈ చెట్టును పూజించడం వల్ల విజయాలు ప్రాప్తిస్తాయి.
స్నేక్ ప్లాంట్: దీనిని సర్ప వృక్షం అని కూడా అంటారు. ఇది ఇంటిలోని గాలిని శుద్ధి చేయడమే కాకుండా చెడు ప్రభావాలను దరిచేరనివ్వదు. మానసిక ప్రశాంతతను అందిస్తూ, ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. దీనిని హాలులో లేదా పడకగదిలో ఉంచడం శుభప్రదం.
తులసి మొక్క: భారతీయ సంస్కృతిలో తులసికి ఉన్న ప్రాముఖ్యత అనన్యం. దీనిని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. తులసి కోట ఉన్న ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటాయి. ప్రతిరోజూ తులసి పూజ చేయడం వల్ల ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది.




