
యుద్దం ముగించేందుకు అమెరికా, ఇరాన్ చర్చలకు సంబంధించి పాకిస్తాన్ లో ఆ దేశాల కీలక ప్రతినిధులు భేటీ కానున్న క్రమంలో ఇస్లామాబాద్ లో హైఅలెర్ట్ ప్రకటించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్, ఇరాన్ కీలక నేతలు వస్తున్నందున భద్రతా కారణాలతో ఇస్లామాబాద్ లో రెండు రోజుల పాటు సెలవులు ఇచ్చారు.
అమెరికా , ఇరాన్ యుద్దం ముగించేందుకు దౌత్య ప్రయత్నాల్లో భాగంగా అమెరికా-ఇరాన్ ప్రతినిధులు ముఖాముఖి భేటీ కానున్నారు. అమెరికాతో నేరుగా చర్చలు జరిపేందుకు ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం రాత్రి పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకోనుంది.ఈ హైలెవెల్ మీటింగ్ ముందు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో రెండు రోజుల పాటు స్థానిక సెలవులను ప్రకటించారు. అధికారిక ప్రకటనలో కారణాన్ని పేర్కొననప్పటికీ దౌత్య పరమైన భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
►ALSO READ | ఇరాన్‌కు ఆయుధాలు ఇస్తే 50 శాతం టారిఫ్: ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
అమెరికాతో చర్చల నిమిత్తం ఇరాన్ ప్రతినిధి బృందం గురువారం రాత్రి ఇస్లామాబాద్‌కు రానుందని పాకిస్థాన్‌లోని ఇరాన్ రాయబారి రెజా అమీరి మొఘాదం తెలిపారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చొరవతో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు ముఖాముఖి భేటీ కానున్నారు. ఈ చర్చల్లో అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తారని ఇప్పటికే వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల ప్రాతిపదికన ఈ చర్చలు జరగనున్నాయి.
ఇజ్రాయెల్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో ఇరాన్ ప్రజల అభిప్రాయంలో సందేహాలు ఉన్నప్పటికీ, ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల ఆధారంగా తీవ్రమైన చర్చల కోసం ఇరాన్ ప్రతినిధి బృందం ఈ రాత్రి ఇస్లామాబాద్‌కు చేరుకోనుంది అని పాకిస్థాన్‌లోని ఇరాన్ రాయబారి రెజా అమీరి మొఘాదం Xలో పోస్ట్ షేర్ చేశారు.