Reading Time: < 1 minute

ఇజ్రాయెల్ – లెబనాన్ దాడుల ఎఫెక్ట్: మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొత్త రేట్లు ఇవే..

Caption of Image.

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచ స్టాక్ మార్కెట్లలో గందరగోళం నెలకొంది. దింతో  ఈరోజు  బుధవారం (ఏప్రిల్ 9న) బంగారం, వెండి ధరలు మూడు వారాల గరిష్ఠ స్థాయి నుండి మళ్లీ తగ్గాయి. మరోవైపు ముడి చమురు (Crude Oil) ధరలు పెరుగుతుండగా, డాలర్ విలువ కూడా బలపడుతోంది. నిన్న భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలపై ఈరోజు ఒత్తిడి పెరిగింది. దీనివల్ల ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

ఈరోజు  24 క్యారెట్ల బంగారం  1 గ్రాము ధర  రూ.234 తగ్గి రూ.15,148,  22 క్యారెట్ల బంగారం  ధర రూ.215 తగ్గి రూ.13,885, 18 క్యారెట్ల బంగారం ధర  రూ.176 రూ.11,361.

ఇక ఈరోజు 10 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,480తో రూ.2,340 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,850 వద్ద  రూ.2,150  దిగొచ్చింది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,13,610తో రూ.1,760 కి చేరింది. 

విజయవాడ, విశాఖపట్నం , అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం రూ.1,51,480 రూ.1,38,850 రూ.1,13,610

హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో రూ.15,148 రూ.13,885 రూ.11,361

ఈ రోజు వెండి ధర 1 గ్రాముకి రూ.5 పడిపోయి  రూ.255తో కిలోకి రూ.5,000 తగ్గి రూ.2,55,000 చేరింది.   

 మధ్యప్రాచ్యంలో (Middle East) కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా అమలు కాక పోగా.. కొన్ని చోట్ల జరుగుతున్న దాడులు  ఇన్వెస్టర్లలో భయాన్ని కలిగిస్తున్నాయి. దీనివల్ల బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. మరోవైపు, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల వల్ల హోర్ముజ్ జలసంధి నుండి వెళ్లే చమురు ట్యాంకర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ ప్రపంచ మార్కెట్లలో గందరగోళాన్ని పెంచుతున్నాయి.

ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య దాడుల వల్ల సముద్ర మార్గంలో చమురు ట్యాంకర్ల ప్రయాణానికి ఆటంకం కలిగిందని వార్తలు రావడంతో  చమురు ధరలు పెరిగాయి. ఇజ్రాయెల్ ఇప్పటికే కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపిస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.