
కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్, లేడీ సూపర్ స్టార్ నయనతార దంపతులు తిరుమల శ్రీవారిని దర్శింకున్నారు. పెళ్లి తర్వాత తరచుగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే ఈ జంట ఈరోజు ( ఏప్రిల్ 9, 2026 ) మరోసారి స్వామివారి సేవలో పాల్గొన్నారు. గురువారం ఉదయం విఐపీ విరామ సమయంలో నయనతార-విఘ్నేష్ దంపతులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
తొలుత ఈ జంటకు ఆలయ అధికారులు ఈ ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. నయనతార సాంప్రదాయబద్ధంగా మెరవగా, విఘ్నేష్ శివన్ పంచెకట్టులో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. నయనతారకు తిరుమల శ్రీవారంటే అపారమైన నమ్మకం ఉంది. తన ప్రతి సినిమా విడుదలకు ముందు లేదా విజయం సాధించిన తర్వాత ఆమె ఖచ్చితంగా తిరుమలకు వస్తుంటారు. నయన్- విఘ్నేష్ నిర్మాతలుగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన Lik మూవీ ఏప్రిల్ 10న విడుదలకానుంది.
నయనతార-విఘ్నేష్ చూసి అభిమానులు వారితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. అయితే భద్రతా సిబ్బంది నడుమ వారు క్షేమంగా దర్శనం ముగించుకుని తిరిగి వెళ్లారు. భక్తి, ప్రేమ కలగలిసిన ఈ జంట ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మూక్కుత్తి అమ్మన్ 2’ , ‘ మన్నాంగట్టి ‘ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే విష్ణు ఎడవన్ దర్శకత్వంలో కవిన్ తో నటిస్తున్న హాయ్ చిత్రం ఏప్రిల్ 2026లో విడుదలకు రెడీ అవుతోంది. అంతే కాకుండా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన నటించేందుకు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు
నయన్ – విఘ్నేష్ నిర్మాతలుగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన #LoveInsuranceKompany ఈ శుక్రవారం విడుదల కానుంది#Nayanthara #VigneshShivan #LIK pic.twitter.com/W4Saqbw5Jv
— Sai Satish (@PROSaiSatish) April 9, 2026