
హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ మూవీ ‘అస్సీ’ (Assi). ఈ చిత్రం 2026 ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలైంది. కోర్ట్‌రూమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పుడు ఈ చిత్రం ఏప్రిల్ 17 నుంచి జీ (ZEE5)లో స్ట్రీమింగ్‌కు రానుంది.
అనుభవ్ సిన్హా డైరెక్ట్ చేసిన ఈ మూవీ భారతదేశపు ‘కుళ్ళిపోయిన వ్యవస్థలోని లోపాలను’ వెలితీసింది. ఇందులో తాప్సీ ‘అడ్వకేట్ రావి’ అనే శక్తివంతమైన లాయర్ పాత్ర పోషించింది. ఒక సంక్లిష్టమైన కేసును ఛేదించే క్రమంలో ఆమె ఎదుర్కొన్న సామాజిక, వ్యక్తిగత సంఘర్షణలే ఈ చిత్ర ప్రధానాంశం.
ఇదొక సాధారణ కోర్ట్‌రూమ్ డ్రామా కాకుండా, మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై బలమైన సందేశాన్ని అందించే సోషల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ముఖ్యంగా రోజుకు నమోదయ్యే సుమారు 80 అత్యాచార కేసుల గణాంకాన్ని ఆధారంగా తీసుకుని “అస్సీ” అనే టైటిల్‌ను నిర్ణయించారు.
కథ:
పరిమ అనే టీచర్ ఢిల్లీలో తన కుటుంబంతో సాధారణ జీవితం గడుపుతూ ఉంటుంది. ఒక రోజు ఆమెపై ఐదుగురు యువకులు దారుణంగా దాడి చేసి, గ్యాంగ్ రేప్ చేస్తారు. తీవ్ర గాయాలతో బయటపడిన ఆమె జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే అడ్వకేట్ రావి ఎదుర్కొన్న సవాళ్లను కళ్ళకి కట్టినట్లుగా చూపించారు డైరెక్టర్ అనుభవ్. కేసుని చివరి వరకు ఉత్కంఠగా సాగే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా మలచడంతో సక్సెస్ అయ్యాడు.
దర్యాప్తు & సామాజిక ఒత్తిడి
పోలీసులు నిందితులను అరెస్ట్ చేసినప్పటికీ, కేసులో అవినీతి, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. సాక్ష్యాల మార్పిడి, లంచాలు కేసును బలహీనపరుస్తాయి. ఇక బాధితురాలు సామాజికంగా ఒంటరిగా మారితుంది. చివరికి స్కూల్ నుంచి తీసేస్తారు. దీనికి తోడు పొరుగువారి విమర్శలు, సమాజపు ఒత్తిడి ఆమెను మానసికంగా కుంగదీస్తాయి.
ఈ సమయంలోనే అడ్వకేట్ రావిగా తాప్సీ కేసును తీసుకుని పోరాటం ప్రారంభిస్తుంది. కోర్ట్‌లో విచారణ తీవ్రంగా చేయడంతో న్యాయవ్యవస్థకే సవాలు విసురుతుంది. ప్రత్యర్థి లాయర్ బాధితురాలినే ప్రశ్నిస్తూ ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తాడు. డీఎన్‌ఏ సాక్ష్యాలు దెబ్బతినడం, సాక్షులు వెనక్కి తగ్గడం వల్ల కేసు బలహీనమవుతుంది. దీంతో ప్రజల్లో ఆగ్రహం పెరిగి నిరసనలు, సోషల్ మీడియా ఉద్యమాలు ప్రారంభమవుతాయి.
ALSO READ : ముగ్గురు స్టార్ల.. ముచ్చటైన కెమిస్ట్రీ.. ‘కాక్టెయిల్ 2’ నుంచి ‘జబ్ తలక్’ సాంగ్ రిలీజ్!
చివర్లో అడ్వకేట్ రావి తన వాదనలతో కేసును మళ్లీ బలపరుస్తుంది. పరిస్థితుల ఆధారిత సాక్ష్యాలు, నిందితుల మాటలలో అబద్దాలను బయటపెట్టి కేసును మలుపుతిప్పుతుంది. చివరికి కోర్టు ఐదుగురు నిందితులను దోషులుగా తేల్చి శిక్ష విధిస్తుంది.