Reading Time: 2 minutes

Cocktail 2: ముగ్గురు స్టార్ల.. ముచ్చటైన కెమిస్ట్రీ.. ‘కాక్టెయిల్ 2’ నుంచి ‘జబ్ తలక్’ సాంగ్ రిలీజ్!

Caption of Image.

బాలీవుడ్ వెండితెరపై మరోసారి రొమాంటిక్ మ్యాజిక్ మొదలైంది. భారీ యాక్షన్ సినిమాలు, సీరియస్ డ్రామాల మధ్య ప్రేక్షకులు మిస్ అవుతున్న అసలైన ‘లైట్‌హార్టెడ్ రొమాంటిక్ కామెడీ’ జోనర్‌ను మళ్ళీ గుర్తు చేస్తూ వస్తోంది ‘కాక్టెయిల్ 2’. గత దశాబ్ద కాలంగా వెండితెరపై ఇలాంటి కలర్‌ఫుల్ సినిమాలు కరువయ్యాయన్న విమర్శలకు సమాధానంగా.. హోమీ అదాజానియా దర్శకత్వంలో వస్తున్న ఈ సీక్వెల్ ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ముచ్చటైన కెమిస్ట్రీ!

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, కృతి సనన్,  నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం నుండి లేటెస్ట్ గా ‘జబ్ తలక్’ అనే సాంగ్ విడుదలైంది. బుధవారం (ఏప్రిల్ 8, 2026) విడుదలైన ఈ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అరిజిత్ సింగ్ తన గాత్రంతో మాయ చేయగా, ప్రీతమ్ అద్భుతమైన ట్యూన్ అందించారు. అమితాబ్ భట్టాచార్య లిరిక్స్ వినగానే ఆకట్టుకునేలా ఉన్నాయి.

ముఖ్యంగా ఈ పాటలో ముగ్గురు నటీనటుల మధ్య ఉన్న బాండింగ్ హైలైట్‌గా నిలిచింది. కృతి, రష్మిక తమ సమ్మర్ అవుట్‌ఫిట్స్‌లో బీచ్ ఒడ్డున మెరిసిపోతుంటే, షాహిద్ కపూర్ తనదైన డాన్స్ స్టెప్పులు, స్వాగ్‌తో అదరగొట్టేశాడు. గతంలో వచ్చిన ‘తుమ్ హీ హో బంధు’ సాంగ్‌ను గుర్తుచేసేలా ఈ పాటలోని లొకేషన్లు, సరదా సంభాషణలు ఉన్నాయి. ప్రస్తుతం నెట్టింట ఈ సాంగ్స్ వైరల్ అవుతోంది.

క్రేజీ కాంబినేషన్

2024లో ‘తేరీ బాంటోన్ మే ఐసా ఉల్జా దియా’ ఘనవిజయం తర్వాత షాహిద్ – కృతి జంట మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోంది. ఇక తొలిసారిగా షాహిద్‌తో రష్మిక జోడీ కడుతుండటంతో అభిమానులు ఈ కొత్త కాంబినేషన్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు అగ్ర కథానాయికలు కృతి – రష్మిక ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఇదే మొదటిసారి. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఈ సాంగ్ యూత్ ను తెగ ఆకట్టుకుంది.

మ్యాజిక్ రీక్రియేట్ అవుతుందా?

సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటీ నటించిన ఒరిజినల్ ‘కాక్టెయిల్’ ఒక ట్రెండ్ సెట్టర్. ఇప్పుడు దానికి సీక్వెల్ అంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజం. అయితే ‘ఓ రోమియో’ సినిమాతో యావరేజ్ రిజల్ట్ అందుకున్న షాహిద్ కపూర్‌కు, ఈ 2026 రెండో చిత్రం చాలా కీలకం. దినేష్ విజన్ తన మేడక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. 

►ALSO READ | రష్మికకు ఆస్తులు రాసిచ్చేసిన తండ్రి: కర్నాటకలో రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లి సంతకాలు !

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా షూటింగ్ నాకు చాలా స్పెషల్ అని దర్శకుడు హోమీ అదాజానియా పేర్కొనడం చూస్తుంటే, కథలో ఏదో కొత్తదనం ఉండబోతోందని అర్థమవుతోంది. ‘జబ్ తలక్’ సాంగ్‌తో అంచనాలు పెంచిన టీమ్, త్వరలో విడుదల చేయబోయే ట్రైలర్‌తో సినిమా రేంజ్‌ను నిర్ణయించనుంది. మరి ఈ ముగ్గురి కెమిస్ట్రీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి..

 

©️ VIL Media Pvt Ltd.