Reading Time: < 1 minute

ఇజ్రాయెల్ చెప్పినట్లే చేసింది : ఇరాన్ లోని రైల్వే బ్రిడ్జిలు కూల్చేసింది..

Caption of Image.

ఓ వైపు చర్చలు జరుగుతున్న సమయంలో.. ఒప్పందానికి డెడ్ లైన్ గడువు ముగియక ముందే ఇజ్రాయెల్ బరితెగించింది. మౌళిక వసతులపై దాడులు చేయకూడదన్న యుద్ధ నిబంధనలను ఉల్లంఘించి మరీ హెచ్చరించింది ఇజ్రాయెల్. వార్నింగ్ ఇచ్చినట్లుగానే ఇరాన్ దేశంలోని రైల్వే బ్రిడ్జిలను కూల్చేసింది. 

2026, ఏప్రిల్ 7వ తేదీ ఇరాన్ టైమింగ్ ప్రకారం ఉదయం 9 గంటల సమయంలో.. ఇజ్రాయెల్ మిస్సైల్స్ తో విరుచుకుపడింది. మధ్య ఇరాన్ లోని కాషాన్ సిటీలో ఉన్న అబాద్ రైల్వే బ్రిడ్జిని బాంబులతో పేల్చేసింది. ఈ దాడిలో ఇద్దరు చనిపోయినట్లు ఇరాన్ న్యూస్ ఏజెన్సీ మెహర్ ప్రకటించింది. 

Also Read : పాకిస్తాన్ దేశవ్యాప్తంగా లాక్ డౌన్

కాషాన్ సిటీలోని రైల్వే బ్రిడ్జిని ఇజ్రాయెల్ పేల్చేసిన విషయాన్ని డిప్యూటీ గవర్నర్ ధృవీకరించినట్లు మెహర్ న్యూస్ ఏజెన్సీ స్పష్టం చేసింది. దాడికి కొన్ని గంటల ముందు.. ఇరానీయులు ఎవరూ ఇవాళ రైళ్లల్లో ప్రయాణించొద్దు.. రైల్వే లైన్లకు దూరంగా ఉండాలి అని హెచ్చరించింది. ఈ వార్నింగ్ కు తగ్గట్టుగానే ఇజ్రాయెల్ ఈ చర్యకు దిగింది. 

చర్చలు జరుగుతున్న సమయంలో ప్రజల రవాణాకు సంబంధించిన రైల్వే వ్యవస్థను టార్గెట్ చేయటం కలకలం రేపుతోంది. దీనికి ప్రతీకారంగా ఇప్పుడు ఇరాన్ ఏ దేశంలో ఎలాంటి దాడులు చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది. 

©️ VIL Media Pvt Ltd.