
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ చెలరేగింది. బీసీసీఐ విధానాలపై ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ తీవ్రంగా మండిపడ్డారు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయాలతో ఏడాదికి రూ.2400 కోట్ల వరకు ఈ లీగ్ కి నష్టం వాటిల్లుతోందని ఆయన చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం లీగ్‌లో 10 టీమ్స్ ఉన్నప్పటికీ కేవలం 74 మ్యాచ్‌లతోనే టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని తెలిపారు. అసలు ఈ ఫార్మాట్ ప్రకారం ప్రతి జట్టు ఒకే ప్రత్యర్థితో రెండేసి మ్యాచ్‌లు ఆడితే లీగ్ దశలోనే 90 మ్యాచ్‌లు, ప్లే ఆఫ్స్ కలిపి మొత్తం 94 మ్యాచ్‌లు జరగాల్సి ఉందని లలిత్ మోడీ పేర్కొన్నారు.
కొద్ది కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన టీ20 లీగ్ గా ఐపీఎల్ చరిత్ర నెలకొల్పింది. ఇటీవలే ఈ టోర్నీ ప్రసార హక్కులు ఏకంగా రూ.48,390 కోట్లకు అమ్ముడుపోవడంతో పాటు ఈ సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు భారీ మొత్తానికి అమ్ముడైయ్యాయి. ఈ విషయంపై కూడా ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మాట్లాడుతూ.. ఒక్కో మ్యాచ్‌కు మీడియా హక్కులతో భారీ ఆదాయం ఆర్జిస్తుంది.. హోంగ్రౌండ్ తో పాటు బయటి స్టేడియాల్లో కూడా మ్యాచ్‌లు జరిగే విధానం అమలు చేస్తే అదనంగా వేల కోట్లు బీసీసీఐ అకౌంట్లో చేరేవి.. ఆ ఆదాయంలో సగం ఐపీఎల్ ఫ్రాంచైజీలకు వెళ్తుంది. దాంతో టీమ్స్ వ్యాల్యూ కూడా మరింత పెరుగుతుందని లలిత్ మోడీ వెల్లడించారు.
ALSO READ : డేవిడ్ వార్నర్ అరెస్టు..
ఇటీవల ఆర్సీబీ, రాజస్థాన్ జట్లు భారీ ధరకు అమ్ముడుపోవడం నాకు సంతోషంగా ఉంది.. కానీ టీమ్స్ కి హామీ ఇచ్చిన ఫార్మాట్‌ను అమలు చేయకపోవడం వాణిజ్య ఒప్పందానికి విరుద్ధమని లలిత్ మోడీ తెలిపారు. ఐపీఎల్ ప్రారంభమైన తొలినాళ్లలో 8 జట్లు మాత్రమే ఉండగా.. ప్రతి టీమ్ హౌంగ్రౌండ్ తో పాటు ఇరత స్టేడియాల్లో ఒకే ప్రత్యర్థితో రెండు మ్యాచ్‌లు తప్పనిసరిగా ఆడుతుండేవి.. కానీ ఇప్పుడు లీగ్‌లో 10 జట్లు ఉన్నాయి. తప్పకుండా 94 మ్యాచులు జరగాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 74 మ్యాచులు మాత్రమే జరుగుతున్నాయి.. తగ్గిన 20 మ్యాచుల వలన ఒక్కో మ్యాచ్ కి వచ్చే రూ. 118 కోట్ల మీడియా రైట్స్ ఆదాయం పోతుంది.. ఫ్రాంచైజీలు కూడా రూ. 120 కోట్ల చొప్పు నష్టపోతున్నారని ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ చెప్పుకొచ్చారు.