Reading Time: 2 minutes

Vijay Deverakonda: అత్తగారింట్లో అడుగుపెట్టిన రౌడీ హీరో.. కొడవ స్టైల్ పట్టుచీరలో మెరిసిపోయిన రష్మిక !

Caption of Image.

టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వైవాహిక బంధం ఇప్పుడు కొత్త రంగులు అద్దుకుంటోంది. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా వివాహం చేసుకున్న ఈ జంట, పెళ్లి తర్వాత తొలిసారిగా రష్మిక సొంత గడ్డ అయిన కొడగు (కూర్గ్)లో అడుగుపెట్టారు. ఏప్రిల్ 6న రష్మిక 30వ పుట్టినరోజు వేడుకలతో పాటు, అక్కడి సంప్రదాయ పద్ధతిలో జరిగిన రిసెప్షన్ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

కొడగు అందాలకు ఫిదా..

ఈ వేడుకలో విజయ్ దేవరకొండ తన మనసులోని మాటలను పంచుకుంటూ అతిథులను మంత్రముగ్ధులను చేశారు. కొడగు నాకు చాలా ఇష్టమైన ప్రాంతం. ఇది నేను ఇక్కడికి రావడం మూడోసారి. రష్మికతో పరిచయం ఏర్పడకముందే నా స్కూల్ స్నేహితులతో కలిసి మొదటి హాలిడే డెస్టినేషన్‌గా కూర్గ్‌నే ఎంచుకున్నాను. విశేషమేమిటంటే.. అప్పట్లో నేను స్టే చేసిన ఇల్లు రష్మిక స్నేహితురాలిదే అని నాకు తర్వాత తెలిసింది అంటూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Also Read : నేను పెళ్లి చేసుకున్నా .. నలుగురు పిల్లలు కూడా!..

కూర్గ్ భామలు అందగత్తెలు!

రష్మిక అందం గురించి మాట్లాడుతూ విజయ్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. కొడగు మహిళలు అత్యంత సుందరంగా ఉంటారని నేను రష్మికను కలవకముందే అనుకునేవాడిని. ఇప్పుడు ఈ ఊరి అమ్మాయినే పెళ్లి చేసుకుని ఇక్కడి వాడినైనందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. వచ్చేసారి వచ్చినప్పుడు రష్మిక చిన్ననాటి జ్ఞాపకాలను, ఆమె పెరిగిన వీధులను దగ్గరుండి చూడాలనుకుంటున్నాను అని విజయ్ ఎమోషనల్ అయ్యారు.

సంప్రదాయం ఉట్టిపడేలా..

ఈ రిసెప్షన్ వేడుకలో రష్మిక మందన్న ‘కొడవ’ శైలిలో పట్టుచీర కట్టుకుని అచ్చమైన కూర్గ్ వధువులా మెరిసిపోయారు. విజయ్ బ్లాక్ బ్లేజర్, వైట్ షర్ట్‌లో క్లాసీగా కనిపించారు. అంతకుముందు ఈ జంట కర్ణాటకలోని ప్రసిద్ధ ఇగ్గుతప్ప ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  విజయ్ మాటల్లోని నిజాయితీ, రష్మిక ముఖంలోని చిరునవ్వు చూస్తుంటే ఈ ‘రీల్ లైఫ్’ జోడీ ‘రియల్ లైఫ్’లోనూ పర్ఫెక్ట్ అనిపిస్తోందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుున్నారు. 

క్రేజీ జోడీ 

వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూనే, ఈ క్రేజీ జోడీ తమ ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ దూసుకుపోతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడవ చిత్రం ‘రణబలి’. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత వీరిద్దరిని వెండితెరపై చూసేందుకు అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
 

 

©️ VIL Media Pvt Ltd.