
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 7న గౌహతిలోని బర్సపరా స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే ఈ రెండు జట్లు విభిన్నమైన పరిస్థితుల్లో ఉన్నాయి. రియాన్ పరాగ్ నాయకత్వంలోని రాజస్థాన్ ఈ సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి, 4 పాయింట్లతో టేబుల్ సెకండ్ పోజిషన్ లో కొనసాగుతుంది. కానీ ముంబై ఇండియన్స్ జట్టు ప్రస్తుతం నిలకడలేమితో సతమతమవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది.
హెడ్ టు హెడ్ పోరు:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్లు ఇప్పటి వరకు 30 మ్యాచ్‌లలో పోటీ పడ్డాయి. ఇందులో ముంబై 16 మ్యాచులలో గెలవగా, రాజస్థాన్ 14 మ్యాచులలో విజయం సాధించింది. దీంతో గత గణంకాలని భట్టి చూస్తే ఎంఐ జట్టుదే అధిపత్యం కనిపిస్తుంది. కానీ ఆర్ఆర్ టీమ్స్ చిచ్చరపిడుగు లాంటి బ్యాటర్లు, బౌలర్లు ఉండటం వారికి ప్లాన్ పాయింట్ అని చెప్పాలి.
Also Read: ఆయనకంటే గొప్పోడివా నువ్వు.. రహానేపై సెహ్వాగ్ ఫైర్!
ఐపీఎల్ హిస్టరీలో రికార్డులు:
* అత్యధిక జట్టు స్కోరు: 217 (ముంబై ఇండియన్స్ – 2025లో జైపూర్ వేదికగా).
* అత్యల్ప జట్టు స్కోరు: 92 (ముంబై ఇండియన్స్ – 2013లో జైపూర్ వేదికగా).
* అత్యధిక వ్యక్తిగత స్కోరు: యశస్వి జైస్వాల్ (124 పరుగులు, 62 బంతుల్లో – 2024 ఐపీఎల్).
* అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు: సందీప్ శర్మ (5/18 – ఏప్రిల్ 22, 2024).
* అత్యధిక పరుగులు (Head to Head): జోస్ బట్లర్ (533 పరుగులు, స్ట్రైక్ రేట్: 148.05).
* అత్యధిక వికెట్లు (Head to Head): జస్ప్రీత్ బుమ్రా (19 వికెట్లు, ఎకానమీ: 6.34).