July 12, 2026

ఆదివాసీల హక్కులను కాపాడ్తం: రాహుల్ గాంధీ

ఆదివాసీల హక్కులను కాపాడ్తం: రాహుల్ గాంధీ
Reading Time: < 1 minute

ఆదివాసీల హక్కులను కాపాడ్తం: రాహుల్ గాంధీ

Caption of Image.

న్యూఢిల్లీ, వెలుగు: నెహ్రూ, ఇందిరాగాంధీ కృషితోనే ఆదివాసీలకు హక్కులు దక్కాయని లోక్​సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో భూమి, అడవులపై ఆదివాసీల హక్కును పరిరక్షిస్తామన్నారు. కాంగ్రెస్​లో ఆదివాసీలకు సముచితస్థానం కల్పిస్తున్నామని.. ఏఐసీసీ నుంచి డీసీసీ పదవుల వరకు ప్రాధాన్యత ఇచ్చామని గుర్తుచేశారు. బుధవారం ఢిల్లీలోని పార్టీ హెడ్డాఫీస్ ఇందిరా భవన్‌‌‌‌‌‌‌‌లో ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేషనల్ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. 

ఈ సందర్భంగా నేతలకు రాహుల్ గాంధీ  దిశానిర్ధేశం చేశారు. గిరిజన హక్కుల రక్షణ,  గ్రామ సభల ప్రాముఖ్యత, వాటి అధికారాల పునరుద్ధరణ, దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీల సామాజిక, ఆర్థిక సమస్యల పరిష్కారం తదితర అంశాలపై మాట్లాడారు. సమావేశంలో ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు విక్రాంత్ భూరియా, తెలంగాణ నుంచి మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.