July 12, 2026

2029లో మిమ్మల్ని మళ్లీ తొక్కకపోతే చూడండి.. ఇదే నా సవాల్: సీఎం రేవంత్

2029లో మిమ్మల్ని మళ్లీ తొక్కకపోతే చూడండి.. ఇదే నా సవాల్: సీఎం రేవంత్
Reading Time: < 1 minute

2029లో మిమ్మల్ని మళ్లీ తొక్కకపోతే చూడండి.. ఇదే నా సవాల్: సీఎం రేవంత్

Caption of Image.

హైదరాబాద్: బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ.. నేను అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదని.. 2023లో మీ నెత్తిమీద కాలు పెట్టి తొక్కి ఇక్కడి వరకు వచ్చానన్నారు. 2029లో కూడా మిమ్మల్ని తొక్కి నిలబడతానని.. మీరంతా కట్టగట్టుకుని వచ్చిన నిలబడతా గుర్తు పెట్టుకోండని అన్నారు. 

2029లో బరాబర్ మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2029లో మీరు ఎలా గెలుస్తారా చూస్తానని.. మిమ్మల్ని మళ్లీ తొక్కకపోతే చూడండి.. ఇదే నా సవాల్ అని హాట్ కామెంట్స్ చేశారు. నేను స్వశక్తితో ఎదిగినవాడినని.. మీరు నా కాలి గోటికి కూడా సరిపోరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

►ALSO READ | హిల్ట్ పాలసీపై ఈడీ, సీబీఐ ఏ విచారణకైనా సిద్ధం: సీఎం రేవంత్

వారసత్వంగా వస్తున్న సీఎం పదవి రాకపోవడంతో విషం కక్కకుతున్నారని కేటీఆర్‎ను విమర్శించారు. తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చి పదేళ్లు ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని దోచుకు తిన్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పరివారానికి తెలంగాణ పరిహారంగా మారిందన్నారు. సొంత ఇంటి ఆడబిడ్డ మాటలను కూడా చాటుగా విన్నారని నిప్పులు చెరిగారు.

గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరల కొనుగోళ్లలో మోసం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు మహిళలు వ్యాపారాలు చేయలేదని.. గత ప్రభుత్వంలో మహిళలను అవమానించారని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పేదేండ్లు సభలో మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు అవకాశం కూడా ఇవ్వలేదని.. కానీ మేం అందరికీ మాట్లాడేందుకు ఛాన్స్ ఇస్తున్నామని తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.