July 12, 2026

అప్పుల బాధతో కొడుకు, గుండెపోటుతో తల్లి.. ఒకే రోజు ఇద్దరు మృతి

అప్పుల బాధతో కొడుకు, గుండెపోటుతో తల్లి.. ఒకే రోజు ఇద్దరు మృతి
Reading Time: < 1 minute

అప్పుల బాధతో కొడుకు, గుండెపోటుతో తల్లి.. ఒకే రోజు ఇద్దరు మృతి

Caption of Image.

జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తల్లీ కొడుకు ఒకే రోజు మృతి చెందారు. జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఒకేరోజు తల్లి కొడుకులు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. 

గ్రామానికి చెందిన  దోడ్ల సంపత్ (25)   అప్పుల బాధతో మంగళవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ కరీంనగర్ ఆసుపత్రిలో ఇవాళ బుధవారం మృతి చెందాడు.  కొడుకు మరణాన్ని తట్టుకోలేక అస్వస్థతకు గురై జగిత్యాల లోని  ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెపోటుతో తల్లి మల్లవ్వ మృతి చెందింది. మల్లవ్వ పెద్ద కొడుకు  ఉపాధి  కోసం వెళ్లి గల్ఫ్  లో ఉంటున్నాడు.  భర్త  గతంలోనే చనిపోయాడు. ఇంటి దగ్గర  ఒంటరిగా ఉన్న తల్లి, కొడుకుల మృతదేహాలకు  ఊరి ప్రజలే ఆత్మబంధువులై చందాలు సేకరించి అంత్యక్రియల  చేశారు.  మృతురాలి పెద్దకొడుకును గల్ఫ్ నుంచి రప్పించాలంటే యుద్ధ ఆంక్షలు ఉన్నాయి.  

►ALOS READ | హైదరాబాద్‎లో అక్కను చంపి ముక్కలు చేసిన తమ్ముడు

©️ VIL Media Pvt Ltd.