పదో తరగతి పాసైనోళ్లకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్… వెంటనే అప్లై చేసుకోండి..Caption of Image.
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సశస్త్ర సీమ బల్ కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మన్ & డ్రైవర్) గ్రూప్–సి నాన్ గెజిటెడ్ (కాంబాటైజ్డ్), నాన్ -మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ మార్చి 21న ప్రారంభమై ఏప్రిల్ 20న ముగుస్తుంది.
మొత్తం ఖాళీలు: 827 గ్రూప్ ‘సి’ నాన్-గెజిటెడ్ (కాంబాటైజ్డ్), నాన్-మినిస్టీరియల్.
కానిస్టేబుల్ (వెటర్నరీ): గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతిలో ఉత్తీర్ణత. వెటర్నరీ హాస్పిటల్ లో వివిధ రకాల జంతువులకు చికిత్స చేయడంలో ఏడాది అనుభవం ఉండాలి.
కానిస్టేబుల్ (డ్రైవర్): 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు చెల్లుబాటు అయ్యే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
కానిస్టేబుల్ (తోటమాలి, వాటర్ క్యారియర్, కోబ్లర్, టైలర్, వాషర్ మన్, బార్బర్, వెయిటర్): మెట్రిక్యులేషన్ లేదా సమాన విద్యార్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో రెండేండ్ల పని అనుభవం ఉండాలి. లేదా గుర్తింపు పొందిన ఐటీఐ/ వృత్తి విద్యా సంస్థ నుంచి ఏడాది సర్టిఫికెట్ కోర్సుతోపాటు కనీసం సంవత్సరం పని అనుభవం ఉండాలి. లేదా గుర్తింపు పొందిన ఐటీఐ నుంచి సంబంధిత ట్రేడులో రెండేండ్ల కోర్సు పూర్తిచేయడంతోపాటు ట్రేడ్ టెస్టులో తప్పనిసరిగా అర్హత సాధించి ఉండాలి.
కానిస్టేబుల్ (కార్పెంటర్): మెట్రిక్యులేషన్ లేదా సమాన అర్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో రెండేండ్ల పని అనుభవం ఉండాలి. లేదా ఏడాది ఐటీఐ/ ఒకేషనల్ కోర్సు పూర్తిచేయడంతోపాటు ఏడాది అనుభవం ఉండాలి. లేదా సంబంధిత ట్రేడ్‌లో రెండేండ్ల ఐటీఐ కోర్సు పూర్తిచేయడంతోపాటు ట్రేడ్ టెస్టులో తప్పనిసరిగా అర్హత సాధించి ఉండాలి.
కానిస్టేబుల్ (నర్సింగ్ సహాయకుడు):10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు సెయింట్ జాన్స్ అంబులెన్స్ ఆర్గనైజేషన్ లేదా రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్‌తోపాటు కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన 50 పడకల హాస్పిటల్లో నర్సింగ్ సహాయకుడిగా కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 27 ఏండ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీ, మాజీ సైనికులకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ ssb.gov.inను సందర్శించండి.
సెలెక్షన్ ప్రాసెస్
అభ్యర్థుల ఎంపిక నాలుగు దశల్లో ఉంటుంది.
పీఈటీ & పీఎస్టీ (శారీరక పరీక్షలు): పురుషులు 4.8 కి.మీ పరుగును 24 నిమిషాల్లో పూర్తి చేయాలి. మహిళలు 2.4 కి.మీ పరుగును 18 నిమిషాల్లో పూర్తి చేయాలి. మాజీ సైనికులకు పీఈటీ నుంచి మినహాయింపు ఉంటుంది.
రాత పరీక్ష: రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష లేదా ఓఎంఆర్ షీట్ ద్వారా నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు కేటాయిస్తారు. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ప్రశ్నల కాఠిన్యత పదో తరగతి స్థాయిలో ఉంటుంది. ఇందులో అర్హత సాధించాలంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, మాజీ సైనికులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలు 45 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
ట్రేడ్ టెస్ట్ : ఇది కేవలం క్వాలిఫయింగ్ ఎగ్జామ్ మాత్రమే. ట్రేడ్స్‌మన్ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ పోస్టులకు డ్రైవింగ్, మెయింటెనెన్స్ టెస్ట్ ఉంటుంది.
వైద్య పరీక్ష: చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది.
ఎగ్జామ్ ప్యాటర్న్
విషయం ప్రశ్నలు మార్కులు
జనరల్ నాలెడ్జ్ 25 25
న్యూమరికల్ ఎబిలిటీ 25 25
రీజనింగ్ ఎబిలిటీ 25 25
ఇంగ్లిష్/ హిందీ 25 25
సిలబస్
జనరల్ నాలెడ్జ్: క్రీడలు, చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రం, వర్తమాన అంశాలు , భారత రాజ్యాంగం.
మ్యాథ్స్: సంఖ్యా వ్యవస్థ, శాతాలు, సగటు, లాభనష్టాలు, వడ్డీ, కాలం–-పని.