July 11, 2026

జగిత్యాల జిల్లాలో పెద్దపులి కోసం గాలింపు.. సీసీ కెమెరాలో పులి కదలికలు

జగిత్యాల జిల్లాలో పెద్దపులి కోసం గాలింపు.. సీసీ కెమెరాలో పులి కదలికలు
Reading Time: < 1 minute

జగిత్యాల జిల్లాలో పెద్దపులి కోసం గాలింపు.. సీసీ కెమెరాలో పులి కదలికలు

Caption of Image.
  • మహారాష్ట్రకు చెందిన జే1 టైగర్‌‌‌‌గా గుర్తింపు

కొడిమ్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ఆవులపై దాడి చేసిన పెద్దపులి మహారాష్ట్రకు చెందిన జే 1 టైగర్‌‌‌‌గా ఆఫీసర్లు గుర్తించారు. సోమవారం పెద్దపులి చంపిన ఆవు కళేబరం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా.. మంగళవారం తెల్లవారుజామున పులి కదలికలు రికార్డు అయ్యాయి. పులి సంచారాన్ని తెలుసుకునేందుకు ఆఫీసర్లు సుబ్బారావు, ముషీర్, రత్నమ్మలు ఇన్‌‌‌‌చార్జులుగా మూడు టీంలను ఏర్పాటు చేసి, ఒక్కో టీమ్‌‌‌‌కు ఐదుగురు సభ్యులను నియమించారు. 

కొడిమ్యాల అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సెంట్రల్‌‌‌‌ స్పెషల్ రెస్క్యూ టీం కొండగట్టుకు చేరుకుంది. కాగా, పులి సంచరిస్తున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అటవీ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లొద్దని ఆఫీసర్లు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దపులికి హాని తలపెట్టకూడదని హెచ్చరించారు. 
 

©️ VIL Media Pvt Ltd.