Reading Time: < 1 minute

బడ్జెట్ సమావేశాల్లోనే పీఆర్సీ ప్రకటించాలి..రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి పీఆర్సీ ప్రకటన చేయాలని తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లింగన్న డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని పెన్షనర్ల భవనంలో అసోసియేషన్ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. 2023 జులై 1 నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు పీఆర్సీ పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉందని తెలిపారు. ఇవి రిలీజ్ చేస్తే 2.50 లక్షల మంది పెన్షనర్ల కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పారు. పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు, ఫైనాన్స్ శాఖలో ఆగిన బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

©️ VIL Media Pvt Ltd.